విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారతదేశానికి కొత్త కుటుంబ ప్రణాళిక అనేది ప్రతి దంపతులకు గర్వకారణం నినాదంతో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జేసీ సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు తదితరులు వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రత్యేక గోడపత్రికను ఆవిష్కరించారు. ఆరోగ్యకర కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించిన దంపతుల్లో లక్కీ డీప్ నిర్వహించి గుర్తించిన విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. ప్రతి జంటకూ రూ. 5 వేలు చొప్పున బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, డీఐవో డాక్టర్ అమృత, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News