Breaking News

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2 తేదీ వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ. కె.చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ ఎం.వాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారణి డాక్టర్ గీత భాయ్ గారు, జిల్లా లేప్రసి ఎయిడ్స్ & టిబి శాఖాధికారి డాక్టర్. అంబటి వెంకట రావు గారు, మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతా భాయ్ గారు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం లో భాగంగా మొత్తము 1403 టీములు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేవ అని పరిశీలిస్తారన్నారు. ఈ సర్వే పరిశీలించడానికి
సూపర్వైజర్లు గా పీ.హెచ్.సి. సిబ్బందిని నియమించారన్నారు.

జిల్లా లెప్రసి ఎయిడ్స్ & టిబి అధికారి డాక్టర్. వెంకట రావు గారు మాట్లాడుతూ ఈ సర్వేలో అనుమానంగా ఉన్న వారిని గుర్తించి వైద్యాధికారులు పరిశీలించి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ మందులు వెంటనే అందజేస్తారన్నారు. కుష్టు వ్యాధికి సంబంధించిన మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బందికి టీములకు సర్వేలో ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స ఇప్పించగలిగితే అంగవైకల్యం నివారించవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో డి. పి. ఎం. ఓ లు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *