Breaking News

మీరేం చేస్తున్నారు.? ఐ సి డి ఎస్ సమీక్ష లో కలెక్టర్ ప్రశాంతి

-బాల్య వివాహాలు , స్త్రీ , శిశు సంరక్షణ , బాలిక విద్యా, గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలి
-ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలి
-ప్రతి రోజు బాలిక పాడావో పై క్షేత్ర స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలని, వర్చువల్ ద్వారా ఐ సి డి ఎస్ కేంద్రాల నిర్వహణా , పనితీరును ప్రత్యేక్షం గా పర్యవేక్షణ సమీక్ష చేస్తానని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేసారు.

సోమవారం కలెక్టరేట్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సి డి పి వో లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా స్త్రీ శిశు సంక్షేమ, ఆరోగ్య పరంగా , బాలిక విద్యా, గర్భిణీ లకి ఖచ్చితమైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ కలిగి ఉండాలి. బాలికల, స్త్రీల సంరక్షణ కోసం ఏ వారం – ఈ రోజూ ఏ కార్యక్రమం చెయ్యాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. బేటి పాడావో – బేటి బచావో యెుక్క ముఖ్య ఉద్దేశ్యం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే అని స్పష్టం చేశారు. అదే విధంగా ఏదైనా ఒక సూక్ష్మ ప్రణాళిక చేపట్టడం ద్వారా ఫలితాలు సాధించడం ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. బాలిక సంరక్షణ విషయంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఓకే కుటుంబంలో రక్తహీనత, బలహీనత ఒక్కరికే రావడం లో గల కారణాలు పరిశోధన వాటికి పరిరక్షణ చర్యలు తీసుకోవలసి ఉంది. అందుకు అనుగుణంగా సప్లిమెంటరీ ఆహార పదార్థాలు అందించడం ద్వారా అటువంటి పిల్లల్ని సంపూర్ణ ఆరోగ్యం చెయ్యడానికి సాధ్యం అవుతుందని ప్రశాంతి తెలియ చేసారు. ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన చికిత్స విధానం కాకుండా ఆయా స్త్రీల , పిల్లల ఆరోగ్య పరిస్థితి ని అంచనా వేసి తదుపరి పోషక ఆహారం అందించాల్సి ఉంటుందన్నారు. కేసు వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆలోచన తీరును విడనాడాలి, సామాజిక బాధ్యత గా విద్యా, ఆరోగ్య, భద్రతా లక్ష్యంగా స్త్రీ శిశు సంరక్షణ కోసం పనిచేయాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఆమేరకు ప్రచారం కల్పించేలా ప్రతీ సమావేశంలో బ్యానర్లు ప్రదర్శన చెయ్యడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలియ చేశారు.

ఏ ఒక్క తల్లి బలహీనంగా ఉన్నా పిల్లలు కావాలని కోరుకొరు, ఆమేరకు తల్లుల్లో అవగాహన కల్పించ కలిగితే సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పిల్లలు పుట్టే అవకాశం ఉందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లాలో కలెక్టర్ గా నా ప్రాధాన్యత లో పిల్లల ఆరోగ్య సంరక్షణ , బాలిక విద్యా, బాల్య వివాహాల అరికట్టుట అన్నారు. క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల సందర్శనకు రావడం జరుగుతుందని, ఆ సమయంలో ప్రీ స్కూల్ నిర్వహణా, హాజరు శాతం ప్రత్యక్షంగా పరిశీలన చేస్తానని కలెక్టర్ తెలిపారు. పోక్సో కు చెందిన 34 రిపోర్టు కాగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. మహిళా ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమాలు వివరాలు అడిగి తెలుసు కున్నారు.

ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ పిడి కే. విజయ కుమారి, జిల్లా పిల్లల సంరక్షణా అధికారి రాజ్ కుమార్, సిడిపీవో లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *