-అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి..
-ఈ ఆఫీసు నోడల్ అధికారులు వివరాలు అందచెయ్యాలి
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, డిఆర్ఓ నరసింహులు లతో కలసి ప్రజల నుంచి 121 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈరోజు ప్రజల నుండి 121 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు.
ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖలకు పరిష్కారం కోసం పంపిన వాటిపై విధమైన చర్యలు తీసుకొన్నారన్నా నివేదిక సమర్పించాలన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో అర్జీదారుల సమస్యలను క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత కాలవ్యవిధంలోనే నాణ్యమైన విధంగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఏఒక్క అర్జీదారుడు తిరిగి అదే అంశంపై మరల దరఖాస్తు చేయని విధంగా అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రతిసోమవారం అందే అర్జీలపై సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటూ ఆవారంలో గానే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
పనితీరులో జవాబుదారీతనం, పారదర్శకత ఉండడంలో ప్రతీ ఒక్క కార్యాలయం తప్పకుండా “ఈ ఆఫీస్ ” ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, అందులో భాగంగా నోడల్ అధికారి వివరాలు అందచేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని తెలియ చేసారు. ఆమేరకు ప్రతీ కార్యాలయం సంబంధిత అధికారి వివరాలు అందచేయాలని పేర్కొన్నారు.
ప్రజలు అందచేసిన కొన్ని అర్జీలు:
బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన జి ఎన్ వి రమణ, జి. సీతారామయ్య లు పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డు ను తొలగించినట్లు అర్జీలు అందచేసారు. జిల్లా గ్రామ పంచాయతీ అధికారిని విచారణ చేపట్టవలసినదిగా ఆదేశించడం జరిగింది.
ధవళేశ్వరం ఎర్రకొండ కు చెందిన తల్లాడ ఉమ తమ కుమారుడు సాయి కుమార్ 2019 నుంచి కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా ఇప్పటి వరకు జాడ తెలియ చెయ్యడం లేదని అర్జీ ఇచ్చారు. అబ్బాయి జాడ కోసం పోలీసులను ఆదేశించాలని, ఆర్ధిక సహాయం చేయాలని కోరడం జరిగింది. తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.
బొమ్మూరు కి చెందిన బండి బేబి ప్రియ తన భర్త యెహోవా 2021 లోన్ మరణించడం జరిగిందని, వితంతు పెన్షన్ కోసం అర్జీ అందజేశారు. జిల్లా అభివృద్ధి అధికారిని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది.
రంగంపేట మండలం బడిసివేరి చెందిన కోన సత్యనారాయణ గ్రామంలోని చెరువు గట్టు మీద ఉన్న మంచినీటి ట్యాంకు నిరుపయోగంగాను , అపరిశుభ్రంగాను ఉందని అర్జి అందచేసారు. తగిన చర్యలుచేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే.దినేష్ కుమార్, డిఆర్వో జీ. నరసింహులు, టూరిజం జె డి వి. స్వామి నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు టీ. రాధిక, ఆర్ట్. కృష్ణ నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News