Breaking News

ఎయిర్‌ఫీల్డ్ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశం

-క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సిఫార్సులు చెయ్యాలి
-ఫ్లయింగ్ జోన్ ఏరియాలో పక్షుల, కోతుల విహారం నియంత్రణా కోసం చర్యలు
– వరద, వర్షపు నీరు దిగువ ప్రాంతానికి పారే విధంగా చర్యలు పై సమీక్ష
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రీ విమానాశ్రయం యెుక్క విశిష్టత, పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన “ఎయిర్‌ఫీల్డ్ పర్యావరణ నిర్వహణ కమిటీ” సమావేశానికి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షత వహించారు.

ఈ సంధర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రీ విమానాశ్రయం యెుక్క విశిష్టత, పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.  వర్షాల కారణంగా, వరదల కారణంగా విమానాశ్రయం ఎటువంటి ఇబ్బందులు లెకుండా తక్షణ చర్యలు పై కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.  ఇందులో భాగంగా తక్షణ చర్యలు, శాశ్వత పరిష్కారం దిశగా రెండు ప్రతిపాదనలు సిద్దం చేసి రెండు రోజుల్లోగా అందచేయాలని సమావేశం లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇరిగేషన్, ఎయిర్ పోర్ట్ అధారటి, ఆర్డీవో సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో సందర్శన చెయ్యాలని కలెక్టర్ పి . ప్రశాంతి ఆదేశించారు. విమానాశ్రయం నుంచి వొచ్చే వర్షపు నీటిని సరైన విధానం ప్రవహించేలా చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. సామాజిక బాధ్యతా విధానంలో ప్రతిపాదిత పనులు ఎయిర్ పోర్ట్ ఆధారటీ ఆధ్వర్యంలో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అందుకు సంబంధించి ప్రాజెక్ట్ నివేదిక వివరాలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలియ చేసారు.

బర్డ్ ఫ్లయింగ్ పై , ఎయిర్ పోర్టు, రన్ వే మార్గంలో కోతుల నియంత్రణ పై అటవీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సిఫార్సు లు చేస్తారన్నారు. శానిటేషన్ పై పంచాయతి అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల భవన నిర్మాణాలు, ఇతర కట్టడాలు విషయములో డివిజన్ , గ్రామ పంచాయతి లు అధికారులు ప్లాన్ లకు అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. నియమ ఉల్లంఘన వాటి విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో నిర్మాణాలు , ప్లాన్ అనుమతుల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించేలా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ (ఎల్ ఏ) లకి సంబందించి భూ సమస్యలు పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో రెవిన్యూ అధికారులు పరిశీలన చేసి నివేదిక అందచేయాలని, అందుకు అనుగుణంగా ప్రతిపాదన సమర్పించాలని ఆదేశించారు

ఈ సమావేశంలో ఇంచార్జీ జాయింట్ కలెక్టర్ కే. దినేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ అధారిటీ పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర్ రావు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఏ సి పి (అడ్మిన్) ఎస్ ఆర్ రాజశేఖర్ రాజు , జిల్లా అటవీ అధికారి బి. నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే. వెంకటేశ్వర రావు, పంచాయతి అధికారులు , ఎయిర్ పోర్ట్, పోలీసు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *