మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నియోహక వర్గంలో రూ.10 కోట్ల 29 లక్షలతో 172 సిసి రోడ్ల నిర్మాణానికి ఆమోదం

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం లో భాగంగా నిడదవోలు నియోజక వర్గ పరిథిలో రూ.1028 లక్షల 53 వేల తో 172 సి సి రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా పెరవలి ఉండ్రాజవరం నిడదవోలు మండల పరిధిలో 172 సీసీ రోడ్ల పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ రూ.1028 లక్షల 53 వేలకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందన్నారు. పెరవలి మండలంలో 31 సీసీ రహదారులు పనులు కోసం రూ.317 లక్షల 70 వేలు, ఉండ్రాజవరం మండలం లో 57 సీసీ రోడ్ల కోసం రూ.300 లక్షల 70 వేలు, నిడదవోలు మండలంలో 84 సీసీ రహదారుల పనుల కోసం రూ.409 లక్షల 93 వేలు మేర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం చట్ట నిబంధనలు, మార్గదర్శకాలు మరియు  నియమాలను అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు పనులను చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *