అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అధికారులకు తగిన సిఫార్సులు చేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు , తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ డి.ఎస్.పి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు, సెంట్రల్ జైలు మరియు ప్రత్యేక జైలు అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *