Breaking News

2030 నాటికి $4 బిలియన్ల MRO పరిశ్రమతో అగ్రగామి ఏవియేషన్ హబ్‌గా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది

-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-గ్లోబల్ ఏవియేషన్ హబ్ హోదా కోసం ఉద్దేశించిన దేశీయ MRO పరిశ్రమను పెంచడానికి భారతదేశం విమాన భాగాలపై ఏకరీతి 5% IGSTని అమలు చేస్తుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్ని విమానాలు మరియు విమాన ఇంజిన్ భాగాలపై 5% ఏకరీతి IGST రేటును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది జూలై 15, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం దేశీయ నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్ (MRO) పరిశ్రమతో భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చే లక్ష్యం కోసం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

ఈ పరిణామం గురించి వ్యాఖ్యానిస్తూ, నాయుడు మాట్లాడుతూ, “MRO వస్తువులపై ఏకరీతిన 5% IGST రేటును ప్రవేశపెట్టడం విమానయాన రంగానికి ఒక పెద్ద ప్రోత్సాహం అని చెప్పచ్చు. గతంలో వివిధ విమాన భాగాలు, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ మరియు MRO ఖాతాలలో GST జమ చేయడం వంటి వాటితో పాటూ 5%, 12%, 18% మరియు 28% వంటి వివిధ GST రేట్లు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ కొత్త విధానం ఈ అసమానతలను తొలగిస్తుంది. అలాగే పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడంతోపాటూ; MRO రంగంలో మరింత వృద్ధి జరిగేలా ప్రోత్సహిస్తుంది.”
ఈ మార్పును సాధ్యం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం పాత్ర గురించి కేంద్ర మంత్రి నొక్కి మరీ చెప్పారు. “ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, మేము ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు కట్టుబడి ఉన్నాము. భారతదేశాన్ని ప్రముఖ విమానయాన హబ్‌గా మార్చడానికి ఆయన మద్దతు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరింత కీలకమైనది” అన్నారాయన.

2024, జూన్ 22న జరిగిన 53వ సమావేశంలో GST కౌన్సిల్ సిఫార్సు చేసిన ఈ పాలసీ సర్దుబాటును సాధించడానికి శ్రద్ధగా పనిచేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఇతర వాటాదారుల యత్నాలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏకరీతి 5% IGST రేటు తగ్గించడం ద్వారా నిర్వహణ ఖర్చులు, పన్ను క్రెడిట్ సమస్యలను పరిష్కరించడం మరియు పెట్టుబడిని ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో- భవిష్యత్ అవకాశాలను హైలైట్ చేస్తూ, రామ్మోహన్ నాయుడు ఇలా అన్నారు. “భారతదేశాన్ని ప్రముఖ విమానయాన కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం. 2030 నాటికి భారతీయ MRO పరిశ్రమ $4 బిలియన్ల పరిశ్రమగా మారుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ విధాన మార్పు అనేది MRO సేవల కోసం, ఆవిష్కరణను నడిపించడం మరియు స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం కోసం అవసరమైన బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో కీలకమైన దశ అని చెప్పచ్చు..”
ఈ చర్య భారతీయ MRO రంగం యొక్క పోటీతత్వాన్ని గణనీయంగా పెంపొందిస్తుందని, ఆవిష్కరణ మరియు సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని అన్నారు. అలాగే బలమైన మరియు సమర్థవంతమైన విమానయాన రంగాన్ని సృష్టిస్తుందని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *