-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
-అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ పాఠశాలలను సందర్శించిన జమ్మూ కశ్మీర్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల విద్యాశాఖ ప్రతినిధులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అలవర్చడమే కాకుండా జీవన విధానాలు కూడా నేర్పిస్తున్నామని, వీటిద్వారా సమర్థవంతమైన విద్యను అందించవచ్చని జమ్ము-కశ్మీర్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యూనిసెఫ్ ప్రతినిధులను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు.
సోమవారం జమ్మూ కశ్మీర్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యూనిసెఫ్ ప్రతినిధులు తమ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ పనితీరు, విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులు పరిశీలించి మెచ్చుకున్నారు.
అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ని, హబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ లో మెంటార్ షిప్ చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులను కలిశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్న్‌షిప్‌లలో భాగంగా ATLలతో కలిసి పనిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థులను ఎస్పీడీ, అతిథులు సర్టిఫికేట్ ద్వారా సన్మానించారు. ఈ ప్రతినిధులు నేడు (మంగళవారం) రెడ్డిగూడెం, మొవ్వ పాఠశాలలను సందర్శించనున్నారు.
ఈ సమావేశంలో సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుండి ప్రతీక్ దేశ్ ముఖ్, యూనిసెఫ్ ప్రతినిధులు శేషగిరి మధుసూధన్ రావు, శిఖా రానా, సుదర్శన్, ప్రియాంక, స్వాతి, SCERT నుండి భాగ్యశ్రీ, విజ్ఞాన్ ఆశ్రం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రతినిధులు
జమ్మూ కశ్మీర్ నుండి తస్సద్దుక్ హుస్సేన్ మీర్ (డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కశ్మీర్), అశోక్ శర్మ (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జమ్ము,) డానిష్ అజీజ్ (ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్, జమ్మూ & కాశ్మీర్, UNICEF), షోయబ్ దార్ (వ్యవస్థాపకుడు, సీఈవో పైజామ్ ఫౌండేషన), అమిత్ కుమార్ (టీచర్), జగదీష్ రాజ్ పనోత్రా (సీనియర్ లెక్చరర్ , ATL నోడల్ ఆఫీసర్ DSE జమ్మూ), జగ్జీత్ సింగ్ (లెక్చరర్), ఇష్ఫాక్ అహ్మద్ మీర్ (లెక్చరర్), బషరత్ హుస్సేన్ (లెక్చరర్), నిసార్ దార్ (నోడల్ ఆఫీసర్, DSEK) పాల్గొన్నారు. ఛత్తీస్ ఘర్ నుండి సమగ్ర శిక్షా స్టేట్ ATL నోడల్ అధికారి అజయ్ పిళ్లై , ATL నోడల్ టీచర్లు అనితా సింగ్, రీతు హండా, బి.ఎన్. యోగి, ధర్మేంద్ర రాత్రే , ఆశిష్ శ్రీవాస్తవ, శ్రీ సుశీల్ పటేల్, అసిస్టెంట్ డైరెక్టర్, రంజు కుమార్ యూనిసెఫ్ స్టేట్ కన్సల్టెంట్, ఛాయా కున్వర్ యూనిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్.
Prajavartha Online Telugu News