Breaking News

జిల్లాలో విజయవంతంగా జలశక్తి అభియాన్‌…

-ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపడుతున్నాం…
-ఈఏడాది 60 కోట్ల 58 లక్షల వ్యయంతో 4,804 పనుల పురోగతి…
-2023 లో రికార్డ్‌ స్థాయిలో పనులు చేశాం…
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి సంరక్షణ, నీటి పారుదల సామర్థ్యాని ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా కార్యక్రమ సమన్వయ అధికారి జి. సృజన అన్నారు.
నగరంలోని కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం జలశక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టి పూర్తి అయిన, చేపడుతున్న పనుల ప్రగతిని డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనీకేషన్స్‌ డైెరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ సెంట్రల్‌ నోడల్‌ అధికారి బి. మాధవరావు, ‘సి’ ఎస్‌ఆర్‌ శాస్త్రవేత రేస్మా ఎస్‌ రామన్‌ పిళ్లైకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టే కేంద్ర ప్రభుత్వ నీటి సంరక్షణ నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచే జలశక్తి అభియాన్‌ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని రెండు దశలలో చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో తొలి సారిగా జలశక్తి అభియాన్‌ 2019 జూలై నుండి అక్టోబర్‌ వరకు మొదటి దశ, రెండవ దశలో నవంబర్‌ నుండి డిసెంబర్‌ వరకు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో యంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌, జల వనరులు, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, ఆర్‌డబ్ల్యుఎస్‌, గ్రౌండ్‌ వాటర్‌ తదితర శాఖల సమన్వయంతో జల సంరక్షణ, వర్షపు నీటి పెంపుదలకు ఫార్మపాండ్‌ చెక్‌డ్యాం పనులలో భాగంగా చిన్న సన్న కారు రైతుల పొలంలో పంట కుంటలు, ఊట కుంటల తవ్వకం, నదీ పరీవాహక ప్రాంతాలలో చెక్‌డ్యాం నిర్మాణం, రూఫ్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌, సాంప్రదాయ నీటి వనరులు /చెరువుల పునరుద్ధరణలో చెరువులు పూడిక తీయడం, గట్లపై మొక్కల పెంపకం, కాలువల పూడిక తీయడం, బోర్‌వెల్‌ రిఛార్జ్‌ నిర్మాణాలు, వాటర్‌ షెడ్ల అభివృద్ధి సమగ్ర అటవీకరణలో పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. చెరువులలో పూడిక తీత, గట్ల వెంబడి మొక్కలు నాటడం, ఆహ్లాదకర వాతావరణం కల్పించడం వంటి లక్ష్యంతో చేపట్టిన అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో 75 చెరువుల లక్ష్యానికి మించి 77 చెరువులలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. చేపట్టిన, చేపడుతున్న, పూర్తి అయిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌, మ్యాపింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇన్ఫఫర్‌మేషన్‌ ఎడ్యుకేషన్‌ కమ్యూనికేషన్‌ (ఐఇసి)లో భాగంగా జలశక్తి అభియాన్‌ కార్యక్రమం పై గ్రామాలలో టామ్‌`టామ్‌, కరపత్రాలు, గ్రూప్‌ మీటింగ్‌, గ్రామ సభలు, జిల్లా, మండల మహిళ సమైఖ్య సమావేశాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, ఎస్‌హెచ్‌జి గ్రూప్‌ సభ్యులు, విద్యార్థులకు జలశక్తి అభియాన్‌ ద్వారా ప్రతీ నీటి బొట్టును వడిసి పట్టె విధంగా సంరక్షించే కార్యక్రామలపై అవగాహన కల్పించామన్నారు. ఈ ఏడాది వర్షకాల బుతుపవన సీజన్‌లో జలశక్తి అభియాన్‌ ద్వారా అమృత్‌ సరోవర్‌ ద్వారా 55 చెరువుల అభివృద్ధి, చిన్న సన్న కారు రైతుల పొలాల్లో 393 పంట కుంటల తవ్వకం, సాంప్రదాయ నీటి వనరులు /చెరువుల పునరుద్ధరణలో 527 పనులు, కాలువలలో పూడిక తీసేందుకు 3000 పనులు, 459 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులలో అభివృద్ధి పనులు, 28 మినీ పెర్కోలేషన్‌ ట్యాంకుల అభివృద్ధి పనులు, కొత్త పశువుల చెరువుల అభివృద్ధి పునరుద్ధరణలో 117 పనులు, 131 రూఫ్‌ వాటర్‌ హార్వస్టింగ్‌ నిర్మాణాలు, 63 సరిహద్దు, భూసారం, తేమ సంరక్షణ కందకాల నిర్మాణ పనులు, మొత్తంగా 4,804 పనులను 60 కోట్ల 58 లక్షల వ్యయంతో చేపట్టామని ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మరి కొన్ని ప్రగతిలో ఉన్నామని జిల్లా కలెక్టర్‌ జి. సృజన వివరించారు.
జలశక్తి అభియాన్‌ సెంట్రల్‌ నోడల్‌ అధికారి బి. మాధవరావు మాట్లాడుతూ జలశక్తి అభియాన్‌ ద్వారా జిల్లాలో చేపడుతున్న పనులు బేషుగ్గా ఉన్నాయని పనులను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌, మ్యాపింగ్‌ నిర్వహించడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో ఆక్రమణలను తొలగించాలని ప్రతీ నీటి బొట్టును రూప్‌ వాటర్‌ హార్వస్టింగ్‌ నిర్మాణాల ద్వారా భూమిలోకి ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని చోట్ల స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం చేసుకోవాలన్నారు.
సి’ ఎస్‌ఆర్‌ శాస్త్రవేత రేస్మా ఎస్‌ రామన్‌ పిళ్లై మాట్లాడుతూ క్యాచ్‌ ది రైన్‌, వర్షపు నీటిని వడిసి పట్టడం ప్రధాన అంశంగా నిర్వహిస్తున్న జలశక్తి అభియాన్‌లో పంచాయతీ భూములు, నిరుపయోగ భూములలో రీఛార్జి నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు.
భూగర్భ జల శాఖ జిల్లా అధికారి నాగరాజు మాట్లాడుతూ 2023`2024 సంవత్సరం జనవరి నుండి మే వరకు గత 2022`2023 సంవత్సరం వర్షపాతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదు కావడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా విసన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం మండలాలలో భూ గర్భ జలాల వినియోగం పెరగడం వలన భూగర్భ జలాల స్థాయి 0.65 మీటర్ల దిగువున ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశాం.
సమావేశంలో డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జే.సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌. నాగమణెమ్మ, ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్‌, డిఆర్డిఏ పిడి కే. శ్రీనివాసరావు, డిపిఓ శివప్రసాద్‌ యాదవ్‌, ఎస్‌ సి ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ఇ డి.వి రమణ గ్రౌండ్‌ వాటర్‌ డిడి నాగరాజా సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *