-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని బాధ్యతతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారులు ప్రజలకు జవాబుదారులుగా వ్యవహరించినప్పుడే లక్ష్యాలు సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ విధులు నిర్వర్తించడంలోనూ ప్రజల సమస్యల పరిష్కారంలోను అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోనన్నారు. ఉద్యోగులకు అధికారులకు ప్రభుత్వం సెలవులు కేటాయించనప్పటికి వాటిని వినియోగించుకోవడంలో నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయన్నారు. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా సెలవులు పెడితే వాటిని అనుమతించబోనన్నారు. విధి నిర్వహణ ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తే అంతే పారదర్శకంగా ప్రజల సమస్యలను పరిష్కరించలన్న ఆలోచన ధోరణి ఉంటుందన్నారు. విధి నిర్వహణలో అధికారుల పనితీరు ప్రభావం కింది స్థాయి సిబ్బంది పై కూడా పడుతుందన్నారు. ఎప్పటికప్పుడు తాను ప్రతి శాఖపై ప్రత్యేక దృష్టి పెడతానని లక్ష్య సాధనలో జాప్యాన్ని గుర్తిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడన్నన్నారు. వార్తా పత్రికలలో వస్తున్న వ్యతిరేక వార్తలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించి అదేరోజు వార్తకు సంబంధించిన వివరణ నివేదికను అందజేయడంతో పాటు ప్రచురించిన వార్త పత్రికలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలనుండి స్వీకరించిన అర్జీలకు నిర్దిష్ట గడువులోపు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 95 అర్జీలు స్వీకరించగా వీటిలో రెవిన్యూ -32, మునిసిపల్ కార్పొరేషన్ -14, పోలీస్ -10, అటవీ శాఖ -1, విద్య శాఖ -9, మత్స్య శాఖ -1, గురుకుల విద్యాలయాల సంస్థ -2, దేవాదాయ -1, డీఆర్డీఏ -8, ఉపాధికల్పన -3, వైద్యఆరోగ్య శాఖ -1, పంచాయితీరాజ్ -7, పౌర సరఫరాలు -2, బీసీ వెల్ఫేర్ -3, రోడ్డు భవనాలు -1 ఉన్నాయన్నారు. ప్రజల నుండి స్వయంగా 45 అర్జీలు, ఆన్లైన్ ద్వారా 50 అర్జీలు స్వీకరించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫిసర్ టిఇఎం రాజు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా. జె. సుమన్, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, డియంహెచ్ఓ డా. ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి, డీఈవో వెంకట సుబ్బారావు, వ్యవసాయ అధికారిణి ఎస్. నాగమణేమ్మ, జిల్లా క్షయ వ్యాధి కంట్రోల్ అధికారిణి డా. ఉషారాణి, జిజి హెచ్ సూపరిండెంటెంట్ డా. వెంకటేశ్వరరావు, ఎల్డియం ప్రియాంక, ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, ఆర్ డబ్ల్యు ఎస్సీ డి. వెంకటరమణ, సర్వ శిక్ష అభియాన్ ఉమామహేశ్వర రావు, డీఐపీఆర్వో యు. సురేంద్రనాధ్, వివిధ శాఖలను చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News