Breaking News

రైతు ఆదాయం పెంపుకు కృషి

-ప్రకృతివ్యవసాయాన్నిప్రోత్సహిస్తాం
-సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దిగుబడి పెంపకు చర్యలు
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతు కు చేరువ చేస్తాం
-భూసారం పెంపుకు ప్రాధాన్యత
-నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెం నాయుడు అధికారులకు ధన్యవాదాలు
-కమీషనర్ ఎస్.ఢిల్లీరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. డిల్లీరావు అన్నారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో కార్యాలయంలోకి కార్యాలయ ఉద్యోగులు ఆహ్వానించారు. అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేసి భాద్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ తీసుకోనున్న చర్యలను వివరించారు. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పరిస్థితులు ఉన్నాయో లాభ నష్టాలను బేరీజు వేసుకొని రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం ”గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ” స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించేలా రైతులను సిద్ధం చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా రసాయనాల వినియోగం ద్వారా తగ్గుతున్న భూసారం వల్ల నష్టపోతున్న రైతులలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుందన్నారు. రైతులు పండిస్తున్న ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేందుకు, రైతులు మరింత ఎక్కువ దిగుబడి సాధించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టనున్నట్లు వివరించారు. వ్యవసాయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తనపై నమ్మకంతో వ్యవసాయ శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని రైతు చెంతకు చేరేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ వృద్ధిరేటును కనీసం ఇంకొక్క శాతమైనా పెరిగేందుకు తమ శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పారు. నకిలీ ఎరువులు పురుగు మందులు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాననితెలిపారు. క్రిమిసంహారక మందుల వినియోగంలో కూడా వ్యవసాయ శాఖ రైతులలో చైతన్యం పెంచేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. అన్ని రంగాలపై ఎంతో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు వ్యవసాయ శాఖను అన్నిరంగాల కంటే ముందు ఉండేలా అవసరమైన ప్రణాళికతో తమ శాఖ ఉద్యోగులతో కలిసి సమిష్టి బాధ్యతతో తన ప్రత్యేకత చాటుకుంటానని తెలిపారు. పుస్తకాల ద్వారా నేర్చుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతుల జీవితాలలో మరింత మార్పు తెచ్చేలా శాఖ పనితీరు ఉంటుందన్నారు. దేశానికి రైతే వెన్నె ముక అనే సూత్రానికి త్రికరణ శుద్ధిగా తాను నమ్ముతానన్నారు. అనంతరంచిర్రావూరు గ్రామానికి చెందిన పోకల పాములు, వీరిశెట్టి శివయ్య, శ్రీనివాసరావు, చిన్న వడ్లపూడి గ్రామానికి చెందిన గూడూరు గోపాలరావు, రాయంకుల వెంకటేశ్వరరావు, వలివేటి జగన్మోహన్ రావులను కమీషనర్ ఢిల్లీరావు సన్మానించారు. కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ వి వి స్వర్ణ జయలక్ష్మి, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి. ప్రసాద్, ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ వి. శ్రీధర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. బాలసుబ్రమణ్యం, జె. జగ్గారావు , జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్. నాగమణెమ్మ వెంకటేశ్వర్లు విజయ భారతి బాల భాస్కర్ ఎఓఎ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమీషనర్ ఢిల్లీరావు కు శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *