Breaking News

యువత నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలి – దేవరపల్లి విక్టర్ బాబు.!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలోని శ్రీ పట్టాభి మెమోరియల్ ట్రైనింగ్ సెంటర్ ఓల్డ్ రైల్వేస్టేషన్ రోడ్డు ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ సంస్ధ మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ప్రయత్నాల్లో అవకాశం రాలేదు అని నిరుత్సాహపడకుండా తమలోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి ఉద్యోగ మేళాలు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్రంలో అనేక సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ దానికి అవసరమైన నైపుణ్యం లేకపోవడం వలనే ఎంపిక కాలేకపోతున్నారు.కావున ప్రస్తుతం ప్రభుత్వం
విద్య తోపాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగు పరిచే దిశగా కృషిచేస్తుంది అని ఆయన తెలిపారు.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్న శిక్షణ శిబిరాలను మరియు ఉద్యోగ మేళా లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.నేటితరం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రపంచంతో పోటీ పడే విధంగా చదువుతోపాటు అదనపు మెళుకువలు నేర్చుకోవాలని అయన సూచించారు.

కాగా ఈ జాబ్ మేళాలో 95 మంది హాజరు కాగా వారిలో 10 ఎంపిక అయ్యారని అధికారులు తెలిపారు.ఎంపికైన అభ్యర్థులకు పట్టాభి సీతారామయ్య ట్రస్ట్ డైరెక్టర్ గోపీచంద్ మరియు యంగ్ ప్రోబేషన్ ఎస్.జయరాజు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ జి.వెంకటేశ్వరరావు వివిధ సంస్థల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *