Breaking News

పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు

-వ్యాధులు వ్యాపించకుండా మెరుగైన చర్యలు తీసుకోవాలి
-భోజనం, తాగునీరు, వసతుల విషయంలో రాజీ పడొద్దు
-బీసీ సంక్షేమ హాస్టళ్లలోని సదుపాయాలపై మంత్రి సవిత ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలన్నారు. మన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో హాస్టల్లోని పిల్లల విషయంలోనూ అదే విధమైన శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే హాస్టళ్లలో పరిశీలన చేయగా, చాలా చోట్ల వసతులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రధానంగా డయేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై చాలా చోట్ల ఫిర్యాదులు అందాయి. వసతుల విషయంలో రాజీ పడే అధికారులను ఉపేక్షించబోనన్నారు. అన్ని హాస్టళ్లలో కూడా విధిగా నిర్వహణ చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినపుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి సవిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *