Breaking News

గురుపూర్ణిమ సందర్భంగా ఆచార్య యార్లగడ్డను సత్కరించిన మిత్ర బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురు పూర్ణమి సందర్భంగా పద్మభూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మిత్ర బృందం విశాఖపట్నం లో ఆదివారం ఘనంగా సత్కరించారు. విశ్వ వ్యాప్తంగా వేలాది మంది శిష్యులను కలిగిన యార్లగడ్డ విద్యారంగానికి చేసిన సేవలు ఎంచదగినవని ఈ సందర్భంగా కొనియాడారు. తొలి రోజులలో పాఠం చెప్పిన ఉత్చాహమే ఇప్పటికీ తమ యార్లగడ్డలో కనిపిస్తుందని, వీలది మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయులో ఉన్నామంటే అది ఆచార్య యార్లగడ్డ గొప్పతనమే నన్నారు.

యార్లగడ్డకు సినారే పురస్కారం
మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా. సి.నారాయణరెడ్డి 93వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని రసమయి సంస్థ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ యర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు డా.సినారే పురస్కారo ప్రధానం చేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం కె రాము తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారక రామారావు కళామందిరంలో ఈనెల 22 సోమవారం రాత్రి ఆరు గంటలకు డా. సముద్రాల వేణుగోపాల చారి సభాధ్యక్షతన జరిగే ఈ మహోత్సవానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, విశిష్ట అతిథిగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, నిర్వాహకురాలిగా ఎంకేఆర్ ఆశాలత వ్యవహరిస్తారు. డా. లక్ష్మీప్రసాద్ కు ఘనంగా సన్మానించి డాక్టర్ సినారే పురస్కారం ప్రదానం చేస్తారని ఎంకే రాము వివరించారు. సభకు ముందు ప్రముఖ వర్ధమాన గాయకులచే డాక్టర్ సినారే గీతాల సుమధుర గానం ఉంటుందని పేర్కొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *