Breaking News

23 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాల తుది విడత ప్రక్రియ

-నోటిఫికేషన్ విడుదల చేసిన కన్వీనర్ డాక్టర్ నవ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్ 2024 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 ప్రారంభం అవుతుం దని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై 23 నుండి జులై 25 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 23 నుండి 26 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని, జూలై 24 నుండి 26 వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పుకు 27వ తేదీ నిర్దేశించామన్నారు. 30వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు నాలుగు పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని డాక్టర్ నవ్య వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *