Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 146 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వారు డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, దేవేంద్ర రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టం ను జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని, అదేవిధంగా డివిజనల్ స్థాయిలో మండల స్థాయిలో ఆయా మండల, డివిజనల్ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టం కు సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని, గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులు సులభంగా అర్జీలు రాయడానికి సదుపాయం కల్పించి, వారి సమస్యను క్లుప్తంగా పొందుపరచే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరుగుతోందని, ప్రతి ఒక అర్జీదారునికి ఒక టోకెన్ జనరేట్ చేసి టోకెన్ ఆధారంగా ఎవరు ముందు వస్తే వారి అర్జీని స్వీకరించడం జరుగుతుందని అన్నారు. టోకెన్ పొందిన వారిని వెయిటింగ్ ఏరియాలో సముచితంగా కూర్చోబెట్టి వారికి కేటాయించిన టోకెన్ బట్టి ఒక క్రమ పద్ధతిలో వారి దగ్గర నుంచి అర్జీలను ఎండార్స్మెంట్ మేరకు సంబంధిత అధికారులు అక్కడికక్కడే ప్రత్యక్షంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి అర్జీదారుని వారి సంబంధిత అధికారి ఎదురు గా కూర్చోబెట్టి అర్జీని చదివి పరిష్కరించే విధంగా వెసులుబాటు కల్పించామని అన్నారు. అర్జీదారుని సమస్యను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారి వారి మండలంలో సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు మరియు తాసిల్దార్లకు , ఎంపీడీవోలకు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు కలెక్టరేట్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలపడం జరుగుతుందని, వారి దృష్టిలో వెంటనే పరిష్కారం ఉంటే వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుపుతారని, ఒకవేళ సమస్య పరిష్కారానికి సమయం కావాల్సి వస్తే ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయంలోపు సమస్యను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వచ్చినటువంటి అర్జీలను 24 గంటలలోగా వారి వారి లాగిన్ లలో అర్జీలను సంబందిత అధికారులు ఓపెన్ చేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్ని అర్జీలు నిర్దేశించిన సమయం లోగా పరిష్కారం అవ్వలేదో అనేది కూడా ప్రతి వారం సమీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి మనకు వచ్చిన అర్జీలు పరిశీలిస్తే 625 అర్జీలు వచ్చాయని అందులో 285 అర్జీలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. మిగిలినవి 295 అర్జీలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఎక్కువగా రెవెన్యూ, మునిసిపల్, లా అండ్ ఆర్డర్, పంచాయతి రాజ్ కు సంబంధించి అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. 45 అర్జీలు రీ ఓపెన్ (సంతృప్తి చెందని అర్జీదారుల అర్జీలు) చేసారని, ఈ 45 లో 30 వాటికి పరిష్కారం చూపామని ఇంకా 15 ఎంక్వైరీ లో ఉన్నాయని తెలిపారు. అర్జీలకు పరిష్కారం చూపించినా పరిష్కారం సంతృప్తి చెందని వారు తిరిగి మరలా వారి అర్జీని రీ ఓపెన్ చేయొచ్చని, తిరిగి అటువంటి వాటికి అర్జీదారుడు మరలా సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపుతామని అన్నారు. అన్ని విధాలుగా అర్జీలను స్వీకరించడం,వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధమై ఉందని అన్నారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖ – 112, ఎం.పి.డి. ఓ – 1, డి.పి.ఓ – 04, పోలీస్ శాఖ – 3, హౌసింగ్ -1, డి.ఆర్.డి.ఏ పి.డి -1, డి.ఎం.హెచ్.ఓ – 3, మున్సిపల్ కార్పొరేషన్ -8, విద్యాశాఖ – 1, సేర్ప్ – 2, జిల్లా పౌర సరఫరాల శాఖ -3, అటవీ శాఖ -1, దేవదయ శాఖ -1, రోడ్లు మరియు భవనాలు శాఖ – 1 , భూగర్భ గనుల శాఖ – 01, రవాణా శాఖ -1, డి.సి.హెచ్.ఎస్ -1, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ – 01 వెరసి మొత్తం 146 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *