Breaking News

గోదావరీ నదికి వరద ప్రవాహం మొదటి హెచ్చరిక

-రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం
-పునరావాస, ముంపు ప్రాంతాల్లో తరలింపు కై సన్నద్ధంగా ఉండాలి
-పునరావాస కేంద్రాల్లో వేడి త్రాగునీరు, వేడిగా ఉన్న ఆహారం అందచెయ్యాలి
-వరద ప్రభావ ప్రాంతాల్లో హెచ్చరికలు చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలి
-వరద ప్రవాహాన్ని చూసేందుకు ఎవ్వరూ రావద్దు, అటువంటి వారిపై కేసులు నమోదు హెచ్చరికలు జారీ చెయ్యాలి
– వరద ప్రభావం వల్ల త్రాగునీరు సరఫరాలలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తో సిద్దంగా ఉండాలన్నారు.
-వ్యవసాయ అనుబంధ నష్టాల అంచనాలు, మౌలిక సదుపాయాల నష్టాల అంచనాలు సమర్పించాలి
-అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
-అందుకు తగిన ప్రతిపాదనలు సమర్పించాలి
-క్షేత్ర స్థాయి నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం..
-పరిస్థితులకి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వరద సహాయక పనులను కమ్యూనిటీ ప్రాతిపదికన చేపట్టాలని, పునరావాస కేంద్రాల్లో ఉండే వారికీ తాగేందుకు వేడి నీళ్లు, వేడిగా ఉండే ఆహరం సరఫరా చెయ్యాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా, డివిజన్, మండల అధికారులతో, ప్రత్యేక అధికారులతో కలెక్టరు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వరద ప్రభావం వలన జరిగిన వ్యవసాయ అనుబంధ నష్టాలతో పాటు మౌలిక సదుపాయాల నష్టాలను అంచనా వేసి సంబంధిత శాఖాధిపతులు సమర్పించాలన్నారు. విపత్తుల నివారణా నేపధ్యంలో తాత్కాలిక , దీర్ఘకాలిక పనులను గుర్తించి, నివేదిక అందజేయాలన్నారు. టీ ఆర్ 27 కింద తాత్కాలిక పనులు కలెక్టర్ అధ్వర్యంలో ప్రతిపాదించి చేపట్టడం జరుగుతుందని, దీర్ఘ కాలిక ప్రయోజనం ఉన్న వాటినీ రాష్ర్ట విపత్తుల నిర్వహణా సంస్థకి ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని ప్రశాంతి తెలిపారు. ఆయా పనులను అందుకు అనుగుణంగా చేపట్టాల్సి ఉందన్నారు.

కొవ్వూరు డివిజన్ లో ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ కింద ఉన్న ముంపు గ్రామాల్లో ఏవిధంగా పునరావాస, తదితర పనులు చేపట్టామో, అదే విధంగా గోదావరీ నదికి తొలి ప్రమాద హెచ్చరిక మేరకు ఆమేరకు కొవ్వూరు, రాజమండ్రీ డివిజన్ ముంపు గ్రామాలను గుర్తించి అక్కడ నుంచి తరలింపు చర్యలకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.  పునరావాస కేంద్రాల్లో ఆహరం, త్రాగునీరు, మెడికల్ క్యాంపు, 24 X 7 శానిటేషన్ ఉండాలని, ప్రభావిత ప్రాంతాలకి మిగిలిన పంచాయతి కార్యదర్శులను, సానిటేషన్ సిబ్బందిని డిప్యూటేషన్ చేయాలన్నారు. పంచాయతీ అధికారులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసి సమన్వయం చేసుకోవాలని ప్రశాంతి తెలియ చేసారు. సోషల్ మీడియాలో వరద లో మిస్సింగ్ అయినట్లు పోస్టులు  వస్తున్నట్లు, వాటి విషయంలో అప్రమత్తంగా ఉండి అటువంటి ఘటనలు జరగకుండా నిరోధించాల్సీ ఉందన్నారు. వరద ప్రాంతాలలో ఎవ్వరూ రాకుండా నియంత్రణా చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుయ్, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చేపట్టడం జరగాలని తెలిపారు.  ముంపుప్రాంతాలన్నీ ముందుగా సందర్శించి అక్కడ చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులను పునరావాస కేంద్రం కు తరలింపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా పునరావాస కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపు ,  శానిటేషన్ నిర్వహణా పై తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో త్రాగునీటి అవసరాలను అనుగుణంగా నీటి సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. నియోజవర్గ మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ప్రధాన కార్య స్థానంలో అందుబాటులో ఉండి వారి శాఖలు సంబంధించిన పనులను అక్కడ నుండే  సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావం వల్ల త్రాగునీరు సరఫరాలలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తో సిద్దంగా ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులతో, పునరావాస, ప్రాధాన్యత, కోర్ శాఖల జిల్లా అధికారులతో  జిల్లా రెవిన్యూ అధికారి సమన్వయం చేసుకుంటూ నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వరద ప్రభావం వల్ల త్రాగునీరు సరఫరాలలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తో సిద్దంగా ఉండాలన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *