Breaking News

HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్ విద్యార్హతతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సాకారం. 2022-23, 2023-24 సం.|| లలో ఇంటర్ లో 75%, ఆపైన ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. MPC మినహా అన్నీ గ్రూపుల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అవకాశం. ఇంటర్ బోర్డు, Skill Development Department, Employment & Training Department మరియు HCL Techbee సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ది.2-8-2024 న మచిలీపట్నంలో జాబ్ మేళా. ఇంటర్మీడియెట్ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగులుగా మారనున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని HCL TechBee ప్రోగ్రాం ద్వారా అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వారికి ఈ మహత్తర అవకాశం లభిస్తోంది. రాష్ట్రంలో 75 శాతం, ఆపైన మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన అన్ని గ్రూపుల (మ్యాథ్స్ మినహా) విద్యార్థులకు ఇంటర్ బోర్డు, ఉపాధి కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (నైపుణ్యాల అభివృద్ది మరియు శిక్షణ శాఖ) మరియు HCL Techbee సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ది.2-8-2024 న మచిలీపట్నంలోని “లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల” నందు, ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న జాబ్ మేళా ద్వారా ఈ ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలలో ఇంటర్ పూర్తి చేసిన, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వీరికి “లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల” నందు ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (క్యాట్) పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలో ఎంపిక అయిన అభ్యర్ధులకు, తదుపరి HR ఇంటర్వ్యూ ఉంటుంది. చివరిగా ఇంగ్లీష్ వర్సంట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాది శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కాలంలో, ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సులు చదివిన వారు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి డీపీఓ విభాగంలో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. *ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్య. ఇంటర్ తో, కొలువులో చేరిన విద్యార్థుల చదువు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో… ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి HCL వారు “అమిటీ యూనివర్సిటీతో” ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా అభ్యర్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. వీటి కొరకు ఆర్థికంగా కూడా సహకారాన్ని అందింస్తుంది HCL.

మంచి అవకాశం
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలను అందించే ప్రణాళిక లో భాగంగా, ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం. ఇంటర్ లో 75 శాతం ఆపైన మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలియ చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *