Breaking News

ఈ నెల 28 నుండి ఆగస్ట్ 2 వరకు నిర్వహించనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు
-హాజరుకానున్న 3142 అభ్యర్థులు : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28 నుండి ఆగస్టు నెల 2 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులతో రేపటి నుండి జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈనెల 28 నుండి ఆగస్టు నెల 2వ తేదీ వరకు ఎపిపియస్సి నిర్వహించనున్న ఈ నెల 28, 29, 30 తేదీన డిపార్ట్మెంటల్ పరీక్షలలో ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్

ఉదయం : 10.00 AM to 12.00 నూన్
మధ్యాహ్నం : 03.00 PM to 5.00 PM
ఈ నెల 31,మరియు ఆగస్టు 01, 02 తేదీన డిస్క్రిప్టివ్ పేపర్స్(కన్వెన్షన్ టైప్ పేపర్స్):
ఉదయం : 10.00 AM to 1.00 PM
మధ్యాహ్నం : 03.00 PM to 6.00 PM వరకు 2 సెంటర్లలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 02 సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగిందనీ 3142 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు 2 (ఇద్దరు ) డిప్యూటీ తాసిల్దార్లను లైజన్ అధికారులుగా,విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.
పరీక్షా కేంద్రం లోనికి అభ్యర్థులను ఉదయం 08:30 – 9:30 మధ్యాహ్నం 01:30 – 2:30 గంటల వరకు మాత్రమే అనుమతించబడును.
పరీక్షా కేంద్రం లోనికి Bare Act పుస్తకాలను మాత్రమే అనుమతించబడును.
పరీక్షా కేంద్రం లోనికి అభ్యర్థులు తప్పనిసరిగా వారి యొక్క డిపార్ట్మెంట్ ఐడి కార్డు/ ఒరిజినల్ ఆధార్ కార్డు ను లను తీసుకొని రావలెను.
పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని , పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం,విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్దం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్ టి సి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిపార్ట్మెంట్ పరీక్ష కేంద్రాల వివరాలు:
9105 – ION డిజిటల్ జోన్, యస్ వి జూ పార్క్ రోడ్, చెర్లోపల్లి, తిరుపతి
33932 – NBKR సైన్స్ & ఆర్ట్స్ కాలేజ్, విద్యానగర్, కోట మండలం, తిరుపతి జిల్లా.

ఈ సమావేశంలో ఎపిపియస్సి అధికారులు గిరిజా రాణి మరియు యశోద, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *