Breaking News

పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ముందు పెట్టె ఓటాన్ బడ్జెట్ ఎన్నికల తరువాత కూడా పెట్టడం అంటే ఆంద్రప్రదేశ్ ఆర్థిక దివాళా తీసినట్లే అని అనుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అద్వర్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద జరిగిన విలేకరుల సమావేశంలో నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ 2019 ఎన్నికల తరువాత మేము పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాము 2024 ఎన్నికల తరువాత మీరు ఎందుకుపెట్టలేదు అని జగన్ మోహన్ రెడ్డి అడగడాన్ని ఎలా చూడాలి? ఈ మొత్తం ఆర్థిక దివాలాకి 6 లక్షల కోట్లు పైగా అప్పుచేసిన జగన్ మోహన్ రెడ్డి దా లేదా బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానిదా? అని రాష్ట్ర ప్రజల తరుపున జగన్ రెడ్డి ని అడుగుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో విధినాటకాలు కన్న అసెంబ్లీ లో ఉండి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కి సమాధానం ఇవ్వవలసిందిగా కోరుచున్నామన్నారు

పంచితే గెలుస్తాం అన్న వైరస్ ని ఓటు అనే పురుగుల మందుతో నిర్ములించి ప్రతిపక్షం హోదా లేకుండా చేసిన కూడా పదే పదే ఓడిన జగన్ మోహన్ రెడ్డి ఉచితాలు అనబడే సూపర్ సిక్స్ తరహా వైరస్ ని అమలు చేయండి అని వత్తిడి చేయడానికి కారణం కొత్త ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం హోదా లేకుండా చేయడానికే అని అనుకోవచ్చు అన్నారు. హామీ ఇచ్చాము కాబట్టి లేదా ప్రతిపక్షం అడుగుతుంది అని సూపర్ సిక్స్ అమలు చేస్తే 2029 లో ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ప్రతిపక్ష పాత్ర లేకుండా పోనున్నదా? రెండు పార్టీ లను బంగాళాఖాతం లో పడేసి డబ్బు మద్యం లేని నూతన రాజకీయాలకు గట్టి పునాది ఏర్పడిన రోజు మీరు నిర్మించున్న వారసత్వ రాజకీయాలు చరిత్ర లో మిగిలిపోతాయి అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్ లు వడ్డీలకు సరిపోదు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ మాటలు పట్టించుకోని పార్టీలు పార్టీలు ప్రభుత్వాలకు ఇప్పుడు హటత్తుగా మన ఆదాయం అత్యవసర ఖర్చులు పోను లోటు కోట్లు అని శ్వేతపత్రం విడుదల చేయటానికి కారణం సూపర్ సిక్స్ అమలుచేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదని ఒప్పుకున్నట్టే అనుకోవచ్చు అన్నారు. కేంద్రం నుంచి రాబోయే నిధులను ఉచిత పథకాలకు వాడుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు అంచనా Rs 146909 కోట్లు గ చూపించే ప్రయత్నం గ భావిస్తున్నాము అన్నారు ఆలా కాకుండా నిజం గా ఆంధ్రప్రదేశ్ నూతన ఆర్థిక విధానం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుంది అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటె అఖిల పక్షం సమావేశం పెట్టి అన్ని పౌర మరియు రాజకీయ పక్షాలను పిలిచి సంక్షేమం అభివృద్ధి తో కూడిన నూతన ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అన్నారు. అఖిల పక్ష సమావేశానికి జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఒక వేళ మీరు అధికారంలోకి వచ్చి ఉంటె రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్ లు వడ్డీలకు సరిపోని ప్రస్తుత తీవ్ర ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్నాలను ఎలా అమలు చేయగలిగే వారో ప్రజలకు చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ కోరుచున్నది. ప్రస్తుత ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు అంటే మీరు అయితే ఆదాయం పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించి అలాగే అప్పులు తగ్గించగలరు అన్న నమ్మకం అని మేము భావిస్తున్నాము అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్క సూపర్ సిక్స్ అమలు కోసమే మీరు ముందుకెల్లితే మీకు కూడా వైస్సార్సీపీ మాదిరి లో ప్రతిపక్ష హోదా లేకుండ చేసి డబ్బు మద్యం లేని నూతన రాజకీయానికి ప్రజలు పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాము అన్నారు.

ఫోరమ్ సభ్యుడు బొప్పన రాజశేఖర్ రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు 6 లక్షల కోట్లు మరి పథకాలకు ఖర్చుపెట్టింది 3 లక్షల కోట్లు మిగతా 3 లక్షల కోట్లు డబ్బు ల సంగతి తేల్చాలిసిందే అని అన్నారు

ఛార్టర్డ్ అకౌంట్నట్ శ్రీరామ్ మూర్తి  మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడం కోసం తప్పుడు హామీలు ఇస్తున్న రాజకీయపార్టీల మీద ఎన్నికల కమిషన్ ద్రుష్టి సారించాలి అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *