Breaking News

సైన్యం లో పని చెయ్యటం అంటే నిజమైన దేశ సేవ… : తరుణ్ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రజత్కార్గిల్దివాస్ 25 సంవత్సరాల విజయ్కార్గిల్దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ కార్గిల్‌లో ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను బలిగొన్న భారత సైన్యానికి చెందిన సైనికులను గుర్తుచేసారు. భారతీయ సైన్యంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ సుబేదార్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, హాజరైన ఇతర అతిథులచే సత్కరించబడ్డారు. సైన్యం లో పని చెయ్యటం అంటే నిజమైన దేశ సేవ అని అన్నారు. నలందా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, NCC యూనిట్ హెడ్ సుధాకర్, ఎన్సీసీ సభ్యులు పాల్గొన్నారు. దేశం కోసం పోరాడి అసువులు బాసిన సైనికుల దినోత్సవానికి 25 వసంతాలు పూర్తి అయిన సందర్భం గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశ భక్తి ఒక్క ఆవశ్యకతను వక్తలు తెలియచెప్పారు. అనంతరం మాజీ సుబేదార్ ప్రభాకర్ ని కాకాని తరుణ్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *