Breaking News

విజయవంతంగా ముగిసిన శిక్షా సప్తాహ్ సంబరాలు

-అధికారులను అభినందించిన శిక్షా సప్తాహ్ నోడల్ అధికారి, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, శిక్షా సప్తాహ్ నోడల్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు IAS ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా విధానం – 2020 ప్రారంభించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22 నుండి 29 వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమం నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా కార్యక్రమాలు జరిగాయని అన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు (TLM ) స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం; పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం; క్రీడా దినోత్సవం; సాంస్కృతిక దినోత్సవం; సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం; పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీ స్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ ( న్యూట్రిషన్ డే ); పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి నాటించడం; పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం (తిథి భోజనాలు) వంటి కార్యక్రమాలు , ముఖ్యంగా. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమమైన ‘విద్యాంజలి’ లో ఒక్కరోజే 2500 కి పైగా పాఠశాలలు నమోదు చేసుకున్నాయని అదేవిధంగా 1500 మంది పైగా వాలంటీర్లు స్వచ్ఛంద సేవలు పాఠశాలలకు అందించడానికి గాను, విద్యాంజలి పోర్టల్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ సామాజిక మాధ్యమాలలో ఆంధ్రప్రదేశ్ శిక్ష సప్తాహ్ కార్యక్రమాలు చోటుచేసుకున్నాయని అభినందించారు. నిర్వహించిన ఆర్జేడీలు, జిల్లా అధికారులకు డైట్ ఉపాధ్యాయులకు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు ప్రశంసించారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *