Breaking News

సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
SERP, MSME మరియు NRI వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాసు అధ్యక్షతన, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ముఖ్య కార్యదర్శి  జి. వీర పాండ్యన్ ఆధ్వర్యంలో, సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ప్రధాన కార్యాలయం లో సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్షా చేయడం జరిగింది. ఈ సమీక్షా లో భాగంగా SERP నిర్మాణం, సిబ్భంది, స్వయం సహాయక సంఘాలు స్థాయిలో చేపడుతున్న వివిధ జీవనోపాధుల మరియు పించన్ల పంపిణిలు పై పూర్తిస్థాయి స్థాయిలో కూలంకషంగా చర్చించడం జరిగింది. గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధిలో MSME నుండి చేపట్టే కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టే కార్యక్రమాలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టే జీవనోపాధి కార్యక్రమాలను మహిళా సంఘాలకు అనుసంధానం చేయాలనీ సూచించడం జరిగింది.
మహిళా స్వయం సహాయ సంఘాల లోని మహిళల ను లక్షాధికారి మహిళల గానే కాకుండా వారిని మరింత అభివృద్ది చేసి, మిలినియర్ మహిళలు గా తీర్చిదిద్దాలని దానికి సంబంధించిన ప్రణాళికలను రాబోయే ఆరు నెలలకు సిద్ధం చేయాలనీ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయ సంఘ సభ్యుల జీవనోపాధుల పై దృష్టి పెట్టి, Farm Livelihoods మరియు Non-Farm livelihoods ద్వారా స్వయం సహాయక సంఘాలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థ[FPO] లను మరింత అభివృధి చెయ్యాలని సూచించారు. బ్యాంకు లింకేజ్ రుణాలు ప్రతి సంఘానికి సకాలం లో అందేవిధంగా ఏర్పాటు చేయాలనీ మరియు సంఘ సభ్యులు ఏదో ఒక సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకొనేలా చూడాలని తెలియపరిచారు. అదేవిధంగా సెర్ప్ ద్వారా చేసే కార్యక్రమాలు ఆరు నెలలకు మరియు సంవత్సర కాలానికి రోడ్ మ్యాప్ తయారు చేసి జీవనోపాధి ప్రణాళికలను తయారుచేయాలనీ సెర్ప్ సంస్థను స్వయం సమృద్ధిగల సంస్థ గా తయారుచేయడానికి సిబ్బంది అందరూ తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో SERP ACEO, డైరెక్టర్లు అడిషనల్ డైరెక్టర్లు, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *