Breaking News

ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై అవగాహన కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి సమావేశ మందిరంలో బుధవారం ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై వ్యవసాయ మరియు అనుబంధశాఖల ఉన్నతాధికారులతో అవగాహన కార్యక్రమాన్ని విజయకుమార్ తల్లం IAS (Retd.), ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గౌరవ సలహాదారు (వ్యవసాయ & సహకార శాఖ) వారి ఆధ్వర్యం లో నిర్వహించారు.
నిరంతరం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగులో వున్న పంటలు ఆ పరిస్థితులను తట్టుకునే నాణ్యమైన లాభసాటి దిగుబడులను సాధించటానికి ప్రకృతి వ్యవసాయం చాలా దోహదపడుతుందని తెలిపారు.
గత దశాబ్ద కాలం నుండి పురుగుమందుల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ , నాణ్యమైన ఉత్పత్తులను సాధించే దిశగా రైతు సాధికార సంస్థ చేస్తున్న ప్రచారం ఎన్ పి ఎం విధానం ఎటువంటి పురుగు మందులు వాడని యాజమాన్యం నుండి జెడ్ బి ఎన్ ఎఫ్ (ZBNF) పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, APCNF (ఆo..ప్ర. ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఇప్పుడు దశలు, దశలు గా రూపాంతరం చెంది, నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ రైతులకు మరింత నమ్మకం ఆర్ధిక భరోసా కల్పించిందని తెలుపుతూ, ఈ ప్రకృతి వ్యవసాయ విదానానికి వ్యవసాయ మరియు అనుబంధరంగాలకు చెందిన అధికారులందరూ మరింత సహకారం, క్షేత్ర స్థాయి లో ప్రచారం కల్పించాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయం లోని వ్యవసాయ పద్ధతులను రాష్ట్రములోని వివిధ ప్రాంతములలోని రైతులు అవలంబించి సత్ఫలితాలను సాధించారన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రములోని రైతులు ప్రకృతి సాగులో చేపట్టిన కొత్త ఆవిష్కరణలను చూపించి, అధికారులందరికి సందేహ నివృత్తి చేశారు. సంప్రదాయంగా బీజామృతo, ద్రవ, ఘన జీవామృతం, ఆచ్చాదనలకు అదనంగా విత్తన గుళికల విధానం (Seed Pellitisation) అవలంబించడం అత్యంత అవసరం అని తెలిపారు . PMDS (ఋతుపవనాలకు ముందుగా విత్తనం వేయడం) విధానం ద్వారా 30 రకాల పంటల 12 కిలోల విత్తనాలను తొలకరికి ముందుగా జల్లి పంట దిగుబడులు సాధించే విధానాన్ని ఎక్కువ మంది రైతులు పాటిస్తున్నారని తెలియచేసారు. A గ్రేడ్ పంట విధానం, డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ మరియు వివిధ పద్ధతులను వివరించారు .
ఈ కార్యక్రమం లో చివరగా మాట్లాడుతూ రైతులు వారి క్షేత్రాలలో సాధించిన విజయాలను వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో పరిగణనలోనికి తీసుకుని, ప్రకృతి వ్యవసాయం కూడా శాస్త్రీయ విధానమేనని అవగాహన పెంచుకుని దిగువ సిబ్బందికి, రైతులకు మరింత అవగాహన పెంచాలని కోరారు.
వ్యవసాయశాఖ సంచాలకులు (డైరెక్టర్) ఎస్. డిల్లీరావు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ విధానమే వ్యవసాయానికి భవిష్యత్తు అని తెలియచేసారు. ప్రకృతి వ్యవసాయంలో పంటలకు అన్ని విధాలుగా దోహదపడే సూర్యరశ్మి, మొక్కలు, భూమిలో స్థిరీకరించుకున్న సూక్ష్మ జీవులు, మట్టిలో ఉన్న మూలకాలు, నీరు మరియు గాలి మొదలగు వాటిని సమగ్రంగా అవగాహన చేసుకుని అవలంబించడం జరుగుతుందని తెలియచేసారు.
సాయంకాలం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు Farmer Scientist course గురించి మరియు రెండు సెమిస్టర్లు పూర్తి చేసుకుని మూడవ సెమిస్టర్ కి వచ్చిన విద్యార్థులతో చర్చించారు. ఈ కోర్సు ప్రవేశం గురుంచి ఆ కోర్సు కోఆర్డినేటర్ అర్హతలు తెలుపుతూ, కోర్సు లో చేరబోయే రైతులు తప్పకుండా ప్రకృతి వ్యవసాయం విధానాలను మరియు A గ్రేడ్ విధానాలను అవలంబిస్తూ వుండాలని తెలియచేసారు. రాష్ట్రములోని వివిధ జిల్లాల డీపీఎం & మెంటార్ లతో విజయకుమార్ గారు చర్చించారు.
ఈ సమావేశం లో బుడితి రాజశేఖర్ IAS, ప్రత్యేకవ్యవసాయ ప్రధాన కార్యదర్శి, కె. శ్రీనివాసులు IAS, సంచాలకులు (Director), ఉద్యానశాఖ, ఎం. విజయసునీత IAS, డైరెక్టర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, బి రామారావు IAS Retd CEO, రైతు సాధికార సంస్థ, శామ్యూల్ ఆనంద్ IAS (Retd) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రైతు సాధికార సంస్థ, డా. మనజిర్ జిలాని సమూన్ IAS, మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ ఫెడ్, శివప్రసాద్ IFS మేనేజింగ్ డైరెక్టర్ విత్తనాభివృద్ది సంస్థ వారు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *