Breaking News

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను రద్దు చేయాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 న దేశ వ్యాప్తంగా జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు.
నేడు విజయవాడ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం నకు వ్యతిరేకంగా.. ఆర్టికల్ 341 ను దిక్కరించి.. రాష్ట్రాలకు లేని అధికారాలను సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ డీ.వై.చంద్ర చూడ్ బెంచ్ తన తీర్పు ద్వారా ఆదేశాలు ఇవ్వడం ప్రెసిడెంషీయల్ ఉత్తరువు లను కాలరాసారని. పార్లమెంట్ పరిధి లోని అంశం పైన సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ RSS హస్తం ఉన్నదన్నారు. దళిత జాతులను విచ్చిన్నం చేయడానికి. వారి సామాజిక ఐక్యత పునాది ని దెబ్బతీయడానికి.. మొత్తం గా ఎస్సీ. ఎస్టీ ల రిజర్వేషన్ లను ఎత్తివేయడానికి జాతీయ స్థాయిలో NDA సర్కార్. సుప్రీం కోర్ట్ లోని వైదిక పీస్వా బ్రాహ్మణ జడ్జి లు కలిసి చేసిన కుట్ర లో భాగంగానే ఈ వర్గీకరణ తీర్పు అన్నారు. ఈ తీర్పు ను రద్దు చేయడానికి.. ఉప సంహారించికోవడానికి మోడీ కేంద్ర సర్కార్ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలోని దళిత పార్టీ లు అయిన RPI. లోక్ జనశక్తి. బి. ఎస్. పి. ఆజాద్ సమాజ్ పార్టీ VCK. భీమ్ ఆర్మీ. నేషనల్ ట్రైబల్ ఫ్రంట్. ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వంటి తదితర సంస్థలు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయని కృష్ణ స్వరూప్ తెలిపారు. బంద్ ను ఉదృతం గా నిర్వహించి
విజయవంతం చేయడం ద్వారా మోడీ సర్కార్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బెంచ్ కి జ్ఞానోదయం కలగడానికి. దోపిడీ మనువాద పాలకుల పైన తీవ్రంగా వత్తిడి తేవడానికి పోరాటం చేయాలన్నారు. కోల్పోయిన హక్కులు పోరాటం ద్వారా నే సాధించికోవడానికి సిద్ధం కావాలని మాలమహానాడు. అంబేద్కర్ వాదులు. దళిత బహుజన ప్రజా సంఘాలకు. విద్యార్థి. ఉద్యోగ. కార్మిక. అధ్యాపక. టీచర్ సమాజానికి పిలుపు ఇచ్చారు.వర్గీకరణ కు మద్దత్తు ఇచ్చే దోపిడీ కుల పార్టీ ల భరతం పట్టాలని.. రాజకీయం గా ఆ పార్టీ లను సమాధి చేయాలన్నారు. ఏపీ లో వర్గీకరణ చేయడానికి NDA రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, బిజెపి నేతలు ప్రయత్నం చేస్తే.. ఇక సామాజిక. రాజకీయ తిరుగుబాటు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఉప్పాడ రామచంద్రరెడ్డి, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్. వీ. ఎల్. రాజు, జాతీయ ఉప అధ్యక్షులు. జొన్నలగడ్డ భాస్కర్ రావు, ఆల్ ఇండియా SC. ST అడ్వకేట్స్ ఫోరమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బాన్న. రమేష్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నెలబాలుడు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *