వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికి వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా ఆయా కార్యదర్శులు తమ పరిధిలో ప్రజల సమస్యల పై అవగాహన కల్గి ఉండాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. అలాగే ప్రజల నుండి అందే అర్జీల్లో ఫైనాన్స్, నాన్ ఫైనాన్స్ అంశాల వారీగా విభజన చేసి, నాన్ ఫైనాన్స్ అంశాలను నిర్దేశిత కాలపరిమితితో పరిష్కారం చేయాలన్నారు. ఫైనాన్స్ అంశాల పరిష్కారం కోసం విభాగాధిపతుల సమన్వయంతో ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ప్రతి సోమవారం అందే ఫిర్యాదుల పరిష్కార నివేదికను తదుపరి వారం జరిగే సమావేశంలో అందించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 65 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 23, ఇంజినీరింగ్ విభాగం 20, రెవెన్యూ విభాగం 6, ప్రజారోగ్య విభాగం 9, ఉపా సెల్ విభాగం 2, అకౌంట్స్ విభాగంకి సంబందించి 5 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ శ్యాం సుందర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ప్రసాద్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డి.సి.పి.లు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్.ఎస్.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *