Breaking News

వాస్తవ సాగుదారులకు / కౌలుదారులకు ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలను పొందటానికి మరింత వెసులుబాటు

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యెక కార్యదర్శి (వ్యవసాయ & సహకారం)

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు నాయకులు ,రైతు సంఘం ఐక్య వేదిక తదితరులతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ IAS వారు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రములోని కౌలు రైతులు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయటానికి, వారికి మరింత సంస్థగత రుణాలు ఇప్పించటానికి మరియు వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాలను విస్తృత పరిచి అందించటానికి సవరణలతో కూడుకున్న కొత్త మార్గదర్శకాలు రూపొంది0చటానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో భూ సంబంధిత చట్టాలు & సమాచారం పై పూర్తి అవగాహన కల్గిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్య కార్యదర్శి బి. కె.అగర్వాల్ IAS (రిటైర్డ్ ), CRISP క్రిస్ప్ సభ్యులు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రమణ్యం, S.డిల్లీ రావు ఐఏఎస్, సంచాలకులు, వ్యవసాయశాఖ వారు, ప్రముఖ రైతు నాయకులు & మాజీ వ్యవసాయ శాఖామాత్యులు వడ్డే శోభనాద్రీశ్వర రావు, కౌలు రైతుల సంఘ నాయకులు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలు రైతుసంఘనాయకులు మాట్లాడుతూ భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డులు మంజూరు చేయాలని, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కౌలు రైతులందరికీ 1,60,000/- రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ ఋణాలు మంజూరు చేయాలని కోరారు.
రెడ్డి సుబ్రమణ్యం ఐఏఎస్ (రిటైర్డ్) వారు మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. రాజశేఖర్ ఐఏఎస్ వారు వీటిపై మార్గదర్శకాలను రూ పొందించటానికి మరిన్ని సమావేశాలను ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. S డిల్లీ రావు, ఐఏఎస్, సంచాలకులు ,వ్యవసాయ శాఖ వారు మాట్లాడుతూ కౌలు రైతులందరిని ఈ పంట లో నమోదు చేయిస్తామని తెలియ చేసారు. ఈ కార్యక్రమం లో రైతు నాయకులు రవి, విస్సా కిరణ్, రాధాకృష్ణ ,హరిబాబు, అజయ్ కుమార్, రాంబాబు ,జమలయ్య, ఆర్ వి కృష్ణ, కృష్ణయ్య, సుబ్బారావు మరియు జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *