Breaking News

ఏపీ ఎన్జీవో సంఘంతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం…..

-ఎన్జీవో సంఘం కృషి ఫలితమే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ…..
-మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి….
-ఏపీ ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ చేసిన కృషి, పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయని సంఘ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంఘంలో చేరడం అభినందనీయమని ఏపీ ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్ అన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ రెగ్యులర్ అయిన ఉద్యోగులకు గాంధీనగర్ లోని ఎన్జీవో హోమ్ లో బుధవారం ఏపీ ఎన్జీవో సంఘ నగర శాఖలో సభ్యత్వం కల్పించే కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ ముఖ్య అతిధిగా హాజరై సభ్యత్వ పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా దాదాపు 70 సంవత్సరాలకు పైబడి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఎనలేని కృషిచేయడం జరిగిందన్నారు. నాల్గొవ తరగతి ఉద్యోగులు మొదలుకొని ఉన్నతాధికారి వరకు నేడు ప్రభుత్వం నుండి పొందుతున్న ప్రతి లబ్ది వెనుక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకుల కృషి పట్టుదల త్యాగాల ఫలితముందన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని దశబ్దాల కాలంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర సంఘం ప్రభుత్వంపై తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగా దశల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేయడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కొత్తగా రెగ్యులరైజ్ అయిన మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన పే ఫిక్సేషన్ తదితర అంశాల పరిష్కారంలో కూడా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సహేతుక పరిష్కారం చూపిందన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నేటి నుండి సభ్యులుగా చేరడం అభినందనీయమని ఇది ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సంఘం మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కుటుంబ సభ్యునిగా తాము భావిస్తామన్నారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టడం జరిగిందన్నారు. స్నేహ పూరితమైన వాతావరణంలో ఉద్యోగ డిమాండ్లను దశలవారీగా పరిష్కారించుకొనేలా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు.

కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా నేతలు డి. సత్యన్నారాయణ రెడ్డి, బి. సతీష్ కుమార్, బీవీ. రమణ, ఎం.రాజుబాబు, ఎం. నాగార్జున రావు, జి. రామ కృష్ణ, డి. విశ్వనాధ్, సిహెచ్ దిలీప్ కుమార్, కె. శివలీల, నగర శాఖ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, ఎస్ కె నజీరుద్ధీన్, సిహెచ్ మధుసూధనరావు, వి.వి. ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీనివాస్,షేక్ ఖాసీం,కె. శివశంకర్, విజయ శ్రీ, మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *