రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం…స్పందించిన జిల్లా కలెక్టర్ 108 కి ఫోన్ కాల్

-తక్షణ వైద్య సహాయం అందించేలా జి ఎస్ ఎల్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు

రాజానగరం,  నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం రాజానగరం నియోజకవర్గ పరిధిలో అకస్మిక తనిఖీలలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108 ఫోన్ చేయడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య సేవలు అందించవలసిందిగా సూచించడం జరిగింది. క్షేత్ర గాత్రులను అంబులెన్స్ ద్వారా జి ఎస్ ఎల్ ఆసుపత్రి కి పంపడం జరిగింది. జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వాహన చోదకులకు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *