Breaking News

జవాబుదారీతనం, పారదర్శక పాలన కు గ్రామాలే నిదర్శనం

-గ్రామ పంచాయతీల పునరజ్జీవనానికి నాందిగా గ్రామ సభ నిర్వహణ
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సభలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరిని ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ సభలు నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను నిర్వహించాలని, ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సభ నిర్వహణ ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణ గ్రామ పంచాయతీల విధానంలో గ్రామ సభాల నిర్వహణా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సభ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభ నిర్వహణ లో నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాలు నిర్వహణ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ సభల్లో అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూపొందించాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదీ విధంగా ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ , కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్డి సౌకర్యం, ఎల్పీజీ సౌకర్యం తదితర అంశాలపై ఫలవంతమైన విధానంలో గ్రామ సభ ల నిర్వహించుకోవాలని అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాల శంకర్రావు, పంచాయతీరాజ్ ఏసీ ఎండి ఆలిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *