Breaking News

వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే తక్షణ స్పందన కోసం ప్రత్యేక కాల్ సెంటర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గుంటూరు నగరంలో వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే తక్షణ స్పందన కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 24/7 పని చేసేలా ప్రత్యేక కాల్ సెంటర్ (0863-2345105 లేదా 98499 08391 కు వాట్స్ అప్) ని ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో వర్షాల వలన ఏ సమస్య ఎదురైనా ప్రజలు తెలియచేయడానికి, అధికారులు తక్షణం స్పందించడానికి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 24/7 విధుల్లో ఉండేలా కాల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాల్ సెంటర్ లో షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వర్షాల వలన నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా, త్రాగునీటి సరఫరాలో సమస్య ఎదురైనా వెంటనే 0863-2345105 నంబర్ కి కాల్ లేదా 98499 08391 కు వాట్స్ అప్ చేయవచ్చన్నారు. సదరు కాల్ సెంటర్ ద్వారా అందే ఫిర్యాదులపై సంబందిత విభాగాధికారులు తక్షణం స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
అధికారులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ వర్షాలకు డ్రైన్ లు పొంగే అవకాశం ఉన్నందున కల్వర్ట్ ల వద్ద, అవుట్ ఫాల్ డ్రైన్లలో వ్యర్ధాలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులకు, గాలులకు చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడితే వెంటనే తొలగించడానికి తగిన ఏర్పాట్లు, సిబ్బందితో ఏడిహెచ్ సిద్దంగా ఉండాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో సమస్య రాకుండా, అవసరమైన ప్రాంతాల్లో జనరేటర్లు అందుబాటులో ఉంచేలా ఏఈలు భాధ్యత తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిస్తే బెయిల్ అవుట్ చేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *