Breaking News

ప్రధాన ఔట్ఫాల్ డ్రైనలలో పూడికలు తీయండి

-రహదారుల పైన వర్షపు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) సిసోడియా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తో కలిసి సున్నప్పటి సెంటర్ నందు కొండ చర్యలు విరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదాలకు గురయ్యే అటువంటి ప్రదేశాలను వెంటనే గుర్తించి అధికారులు అకడున్న ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి మదర్ తెరెసా జంక్షన్ మొగల్రాజపురం, పర్యటించి పరిశీలించారు గత రెండు రోజులుగా పడుతున్న వర్షం వల్ల రహదారుల పైన నిలిచిపోయి ఉన్న నీళ్లను ఎయిర్ టేక్ మిషన్స్ తో వెంటనే తీసివేయాలని, రోడ్లపైన వర్షపు నీళ్ళు నిలవకుండా ఉండేందుకు డ్రైన్ లలో పూడికలు తీస్తూ ప్రధాన అవుట్ఫాల్ట్ డ్రైన్ లలో ఎటువంటి ఆటంకం లేకుండా వర్షపు నీరు ప్రవహించేటట్టు చూసుకోవాలని అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

తదుపరి కండ్రిక రాజీవ్ నగర్, నూజివీడు రోడ్ నందు పర్యటించి పరిశీలించారు. ప్రధాన ఔట్ఫాల్ట్ డ్రైనలలో పూడికలు తీయడానికి ఉన్న మెషిన్లనే కాకుండా అవసరమైతే అదనపు మెషిన్లను తీసుకొని పూడికలను త్వరతగతిన తీసి వర్షపు నీటి ప్రవాహం డ్రైన్లలో ఆగకుండా వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న వర్షపు నీటి నిలువలను కాలువలో పంపించేలా తగు చర్యలు తీసుకోవాలని దానికి ఇరిగేషన్ శాఖ సమన్వయంతో బందర్, రైవస్ మరియు ఏలూరు కాలువలో వర్షపునీరుని తరలించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ వారి సమన్వయంతో బందరు, రైవస్ కాలువలు వదిలే నీళ్లను ఆపి నగర నీళ్లను వదిలేలాగా ఏలూరు కాలవలోనూ నీటిమట్టం తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, కేవలం ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ సిబ్బంది కాకుండా శాఖతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అధికారి ఫీల్డ్ లో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఒకవైపు సైడ్ కాలువల్లో పూడికలు తీయుట మేజర్ అవుట్ ఫర్ డ్రైన్ లలో పూడికలు తీయుట దాంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న రహదారుల పైన నిల్వ ఉన్న నీళ్లను ఏర్టెక్ మెషిన్స్ లతో, పంపింగ్ మెషిన్లతో మోటర్ సహాయంతో నీటిని తీస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న ఎలాంటి సమస్య అయినా శాఖల సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని, చెట్లు విరిగిపడిన, రోడ్డుపైన నీటి నిల్వలు ఉన్న, ప్రజల నుండి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు వరద సంబంధిత ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయొచ్చని, ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని , ప్రజలు ఈ నంబర్లకు 0866-2424172, 0866-2427485 ఫోను చేయొచ్చని 8181960909 నెంబర్ కు వాట్సాప్ ద్వారా కూడా తెలుపవచ్చని, సమస్య అందిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *