Breaking News

సెప్టెంబర్ 5 న NAC బొమ్మూరు ప్రాంగణంలో మినీ జాబ్ మేళా

-సెప్టెంబరు నెలలో 610 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ విడుదల
-గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులు సెప్టెంబరు 5 వ తేదీన చేపట్టనున్న జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సెప్టెంబరు నెలకు చెందిన జాబ్ క్యాలెండర్ ను కలెక్టరు ఆవిష్కరించారు.  కలెక్టర్ మాట్లాడుతూ చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత కోసం విధ విధ కంపెనీలలో 610 ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏ పీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళ ను ఈ నెల 5వ తేదీన NAC సెంటర్, బొమ్మురు నందు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళకు హాజర అయ్యే యువతీ యువకులు ఆన్లైన్ లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అని జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపనీలు (శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆపోలో ఫార్మసీ, కె ఎల్ గ్రూప్ కంపెనీలు) హాజరుకానున్నాయని తెలిపారు. వీటిలో గల వివిధ ఉద్యోగాలలో పనిచేయడానికి డిగ్రీ, ఫార్మసీ, యం ఫార్మసీ, డిగ్రీ,ఇంటర్, పదవ తరగతి, పూర్తి చేసిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని ఆయన వివరించారు. ఆ రోజున నిర్వహించే ” మినీ జాబ్ మేళా” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి , తూ తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://forms.gle/vAhpUpciMBVn5ji59 నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి సదరు ” మినీ జాబ్ మేళా” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఈనెల 5 వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు NAC బొమ్మూరు వద్దకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు “7396740041”నెంబర ను సంప్రదించాలని సూచించారు.( సంప్రదించాల్సిన సమయం 10 Am to 5Pm)

సెప్టెంబరు నెలలో జాబ్ క్యాలండర్:
తాళ్లపూడి, రావులపాలెం, ఈతకోట, గోపాలపురం లలో 30 పోస్టుల భర్తీకి శ్రీరామ్ గ్రూపులు తరపున నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాజమండ్రి, నిడదవోలు, పోలవరం లలో 80 పోస్టుల అపోలో ఫార్మసీ లో నియామకాలు జరుపుతున్నట్లు తెలియ చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పుదువేల్ లోని వేర్ హౌజ్ అసోసియేట్స్ నందు 500 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లనీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *