“అకిరా మియావాకీ”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ సమతుల్యత మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో దట్టమైన మొక్కలతో చిన్న-అడవులను సృష్టించడానికి ఉపాధి హామీ పథకం కింద “అకిరా మియావాకీ” ఒక చక్కటి అవకాశం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు .

మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఈ క్రాప్, ఎలెక్షన్ హౌజ్ హోల్డ్ సర్వే, రెవెన్యు, ఆర్ వో ఆర్ మ్యుటేషన్, ఉపాధి హామీ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డీ ఆర్వో జి నరసింహులు లతో కలిసి ఆర్డీవో, తహసిల్దార్ ఇతర మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ క్రాప్ బుకింగ్,  వి ఏ వో, వి ఆర్ వో అధంటిఫికేషన్  పై మండల స్థాయి అధికారులతో వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

జాయింట్ రెవిన్యూ ఖాతాలో ఉన్న భూమి విస్తీర్ణం సర్వే చేపట్టి వాటి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ వాటి వివరాలు కేసుల వారీగా నివేదిక అందచేయాలని ఆదేశించారు. జాయింట్ ఎల్ పి కి చెంది 31, 395 రికార్డుల లో ఇంకా పూర్తి చెయ్యాల్సిన 28, 785 కి చెంది యాక్షన్ ప్లాన్ అందచేయాలని పేర్కొన్నారు.

జిల్లాలో 306754 ఎకరాలు ఈ క్రాప్ బుకింగ్ చేపట్టే వలసి ఉండగా 2,82,579 ఎకరాలు (92.12%) మాత్రమే పూర్తి చేశారన్నారు. మిగిలిన లక్ష్యాలు సెప్టెంబర్ 10 కి పూర్తి చేయాలన్నారు. గ్రామ వ్యవసాయ అధికారి 2,57,006 (90.95%) వాటిలో గ్రామ రెవెన్యూ అధికారి 2,44,529 (95.15%) ఆథాంటిఫికేషన్ పూర్తి చేశారని, రానున్న 48 గంటల్లో ఆథాంటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు.

ఎన్నికల – ఓటరు జాబితా ఇంటింటి సర్వే పై సమీక్షా చేస్తూ 16,24,329 ఓటర్ల గుర్తింపు లో 6,31,267 (38.86%) మాత్రమే పూర్తి చెయ్యడం పై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. నిడదవోలు (27.69%) , అనపర్తి (29.27%) , రాజమండ్రి రూరల్ (30.75%) మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన హౌజ్ హోల్డ్ సర్వే కి చెందిన బి ఎల్ వో స్థాయిలో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు.  ఫారం 6 , ఫారం 7 , ఫారం 8 పెండింగ్ ఫారం లను తక్షణం పరిష్కారం చెయ్యాలనీ, తొలగింపుకు చెందిన వాటికి సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు.  ఎన్నికల సమయంలొ పాటించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం తప్పని సరి అని స్పష్టం చేశారు.

రెవిన్యూ అంశలపై సమీక్ష చేస్తూ, మ్యుటేషన్ కి చెందిన ఫైల్స్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.  వచ్చే వీడియో కాన్ఫరెన్స్ నాటికి పెండింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. 55999 మ్యుటేషన్ లలో 52,197 ఆమోదించగా,2919 తిరస్కరించడం జరిగిందనీ, ఇంకా 526 పెండింగులో ఉన్నట్లు తెలిపారు. తిరస్కరించిన వాటిలో కొన్ని క్రాస్ చెక్ చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ లాగిన్ లో అర్హత కలిగిన వాటిని పరిష్కారం చేయాలన్నారు.

ఉపాధి హామీ పథకం కింద “అకిరా మియావాకీ” కింద దట్టమైన అటవీ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చెయ్యడం జరిగిందనీ , తద్వారా తొలి ఏడాది 780 పనీ దినాలు, రెండో ఏడాది 350 పనీ దినాలు కల్పించవచ్చునని కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన అంశం అని, ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచన తో రూపుదిద్దుకున్న దృష్ట్యా స్థలాలు గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. 25 సెంట్ల స్థలంలో ప్రతీ మండలంలో కనీసం 20 స్థలాలు గుర్తించాలన్నారు. ఒకటి రెండు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రోగ్రాం అధికారులకి ఇదో చక్కటి వేదిక అన్నారు. స్కూల్స్, కాలేజిలు, పంచాయతీ లలో ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ లేఔట్ లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, వాటర్ ట్యాంక్ కింద, చెరువు గట్ల ప్రాంతాల్లో ఏర్పాటు సానుకూలత ఉందన్నారు.

జిల్లాకు చెందిన 50 లక్షల పని దినాలకి 37.31 లక్షల పని దినాలు సాధించడం జరిగిందనీ తెలిపారు. ప్రతీ రోజూ జిల్లాలో 11,200 పనిదినాలు కల్పిస్తున్నారని, మరో 700 నుంచి 800 వరకూ పని దినాలు అధికంగా ఏర్పాటు చెయ్యగలిగితే, లక్ష్య సాధన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. హౌసింగ్ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకం లక్ష్యం చేరుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు, డిఆర్వో జి. నరసింహులు, డిసిఒ ఆర్. శ్రీరాములు నాయుడు, డిఎవో ఎస్ మాధవరావు, డిపీవో దాసరి రాంబాబు, సిపివో ఎల్. అప్పల కొండ , డీఎల్ డివో పి. వీణాదేవి, వి. శాంతా మణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *