Breaking News

ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా అన్నదానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత మూడు రోజులుగా కురుస్తున్న తీవ్రభారీ వర్షాల కారణంగా విజయవాడ అస్తవ్యస్తం అయింది. విజయవాడ పరిస్థితి అతి విషమంగా ఉంది. ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నాము. కబేళా సితార ప్రాంతాలలో వరద బాధితులకు ప్రసాద వితరణ చేశారు. మరియు రామలింగేశ్వర నగర్, కృష్ణలంక చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా ప్రాంతాలలో ప్రసాద వితరణ చేయడం జరిగింది. రామలింగేశ్వలనగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాల వాళ్ళు నీటి మునగడంతో జగన్నాథ మందిరంలోకి వచ్చి ఉన్నారు వారందరికీ మూడు పూటలా ప్రసాదాన్ని ఇస్కాన్ విజయవాడ వారు అందిస్తున్నారు. మరియు పాల ప్యాకెట్స్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు మరియు శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు శ్రీ జగన్నాథ్ మందిరానికి విచ్చేసి జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఇస్కాన్ విజయవాడ వారు వరద బాధితులకు సహాయాన్ని చేస్తున్నారు అని కొనియాడారు. ఆధ్యాత్మికతను నలు దిశలా వ్యాపింప చేయటమే కాకుండా ప్రజలకు విపత్కర పరిస్థితుల్లో వాళ్లకి ఎనలేని సహాయం చేస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్కాన్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలిపారు అని మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధరి దాస్ తెలియ చేశారు. ఇక ముందు కూడా విపత్కర పరిస్థితి లో ఇస్కాన్ సేవలు ఎల్లప్పుడూ వుంటాయని శ్రీమాన్ చక్రధరి దాస్ తెలియ చేస్తున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *