Breaking News

బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా ఆహార పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా విజయవాడ ముంపు ప్రాంతాలకు ఆహార పంపిణీ నిర్వహించారు. రాజరాజేశ్వరీ నగర్, వైఎస్ ఆర్ కాలనీ కి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్ లు, ఆహారం ఈరోజు అందించారు. మైనారటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఆహార పంపిణీ నిర్వహించారు, కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు ఆరువేల వాటర్ బాటిల్స్ బిజెపి కార్యాలయానికి అందించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, షేక్ బాజీ లు మీడియా తో మాట్లాడుతూ మానవత్వం తో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణలంక ప్రాంతంలో బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *