Breaking News

న‌గ‌రంలో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్య‌మే కార‌ణం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌నం ప్ర‌శ్నిస్తే తిరుగుముఖం ప‌ట్టిన జ‌గ‌న్
-ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ పై జ‌నం ప్ర‌శ్నాస్త్రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అస్సా తుఫాన్ కార‌ణంగా విజ‌య‌వాడ న‌గ‌రం జ‌ల‌మ‌యం కావ‌టానికి, న‌గ‌రవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవ‌టానికి గ‌త ఐదేళ్లు గా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కార‌ణ‌మ‌ని ఎంపి కేశినేని శివనాథ్ మండిప‌డ్డారు. సింగ్ న‌గ‌ర్ లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్ట‌ర్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం మీడియా ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

బుడ‌మేరు వాగు పూడిక‌తీత‌, నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి 2019లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిధులు విడుద‌ల చేస్తే..ఆ త‌ర్వాత అధికాంలోకి వ‌చ్చిన బుడ‌మేరు వాగు పూడిక‌తీత ప‌నుల‌పై దృష్టి పెట్ట‌లేద‌న్నారు. ఆ నిధులు ప‌క్క దారి ప‌ట్టించుకుండా ఉప‌యోగించి వుంటే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డి వుండేది కాద‌న్నారు. భారీ వ‌ర‌ద కార‌ణంగా బుడ‌మేరులో నీరు సజావుగా సాగ‌టానికి వీల్లేకుండా వుండి, పొంగిపోర్లుతున్నాయ‌న్నారు. గ‌త ఐదేళ్ల‌లో కాల్వ గ‌ట్లు ప‌టిష్ట‌త‌కి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌ట‌మే తోనే బుడ‌మేర వాగుకి గండి ప‌డింద‌న్నారు.

ఎమ్మెల్యే జ‌గ‌న్ సింగ్ న‌గ‌ర్ లో వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌టానికి వ‌చ్చిన‌ట్లు లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో వుంటే రాజ‌కీయం చేయ‌టానికి వ‌చ్చాడ‌న‌నారు. ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌టానికి ఒక్క పులిహోర పొట్లామ‌న్న ఇచ్చాడా అంటూ ప్ర‌శ్నించారు. క‌నీసం త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు బాధితుల‌కి అండ‌గా నిల‌బ‌డాల‌ని చెప్ప‌లేక‌పోయాడ‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఆ ప్రాంత ప్ర‌జ‌లు తిరిగి ప్ర‌శ్నించ‌టంతో జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌కుండా వెన‌క్కి వెళ్లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. జ‌గ‌న్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా రాజ‌కీయం చేయాల‌నుకోవ‌టం సిగ్గుచేట‌న్నారు.ప్ర‌జ‌లు అన్ని విష‌యాలు గ్ర‌హిస్తార‌ని, జ‌గ‌న్ త‌మ కోసం కాకుండా త‌న స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వ‌చ్చాడ‌నే విష‌యం గ్ర‌హించే ప్ర‌జ‌లు జ‌గ‌న్ ను తిర‌స్క‌రించార‌న్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద బాధితుల్ని ఆదుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వుంటూ మూడు రోజులుగా రాత్రింబ‌ళ్లు ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ…స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ బాధితుల్ని ర‌క్షించేందుకు యంత్రాగాన్ని మొత్తం ప‌రుగులు పెట్టిస్తున్నార‌న్న విష‌యం ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నార‌ని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *