Breaking News

మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజనా పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) మంత్రులు అచ్చెం నాయుడు , ప్రత్తిపాటి పుల్లారావు లతో కలిసి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, సితార, ప్రాంతాలలో ట్రాక్టర్లలో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని సుజనా ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. అందరికీ ఆహారం అందేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. కార్యక్రమంలో మాజీ తానా ప్రతినిధి కోమటి జయరాం, నాగుల్ మీరా కూటమి నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *