Breaking News

వ‌ర‌ద బాధితులంద‌రికీ ఆక‌లి తీర్చేందుకు డ్రోన్స్ తో సాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో బోట్స్,ఇత‌ర మార్గాల ద్వారా సాయం అందించేందుకు వీల్లేని ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితుల‌కి డ్రోన్స్ ద్వారా సాయం అందిస్తున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్ట‌ర్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం కేంద్ర పౌర‌విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌లిసి డ్రోన్ల ద్వారా ఫుడ్ అండ్ మెడిక‌ల్ కిట్ డెలివ‌రీ విధానాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్, మంత్రి స‌విత‌,ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడుకి సింగ్ న‌గ‌ర్, జ‌క్కంపూడిలోని వ‌ర‌ద ప‌రిస్థితి వివ‌రించారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ వ‌ర‌ద ముంపులో చిక్క‌కున్న ప్ర‌తి ఒక్కరికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం టెక్నాల‌జీని కూడా వినియోగించుకుంటుంద‌న్నారు. మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాలు బోట్స్ ద్వారా, బోట్స్ వెళ్ల‌లేని ప్ర‌దేశాల‌కు, హెలికాప్ట‌ర్స్ ద్వారా ఆహ‌రం,నీళ్లు అందించే ఏర్పాట్లు చేశామ‌న్నారు. హెలికాప్టర్ ద్వారా కూడా సాధ్యం కానీ ప్రదేశాలకు డ్రోన్స్ ద్వారా ఆహారంతో పాటు వారికి అవసరమైన మెడికల్ కిట్స్ పంపిణీ చేస్తామని తెలిపారు..ఈ డ్రోన్స్ 8 నుంచి 10 కిలోల వరకు బరువు మోయగలవన్నారు. మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా యంత్రాంగం అంతా కంటికి నిద్ర లేకుండా రాత్రింబవళ్లు వరద బాధితులకు సాయం చేస్తూ వారిని రక్షించేందుకు పరుగులు పెడుతుంటే , ఈ విపత్కర పరిస్థితుల పై కూడా ఎమ్మెల్యే జగన్ తన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *