Breaking News

పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు

-పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చర్యలు: జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్లు

తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు, పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చేపట్టవలసిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించి ముఖద్వారం పూడిక తీత, రహదారి వెడల్పు తదితర అంశాలు ప్రణాళికా బద్ధంగా కమిటీ నిర్ణయాల మేరకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పులికాట్ సరస్సు ముఖ ద్వారం వద్ద పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని, పులికాట్ అభయారణ్యంకు ఎంతగానో ఉపయోగ పడుతుంది అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

గురువారం సాయంత్రం పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ ఆఫ్ పులికాట్ బర్డ్ సాంక్చురీ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర అటవీ శాఖ నుండి అందిన సమాచారం మేరకు కమిటీ ఏర్పాటు అయిందని తెలిపారు. ఈ కమిటీ నందు I) చైర్మన్ జిల్లా కలెక్టర్ 2) డా. ఎం. బూబేష్ గుప్త, ఫౌండర్ అండ్ డైరెక్టర్ యూనివర్సల్ ఎకో ఫౌండేషన్, పాండిచ్చేరి 3) డా. ఎం. రాజశేఖర్ ఎం.ఎస్సీ. పీహెచ్డీ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జూవాలజీ, ఎస్వీ యూనివర్సిటీ 4) డా. గోపి సైంటిస్ట్ ( వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ రెప్రజెంటేటివ్ డెహ్రాడూన్) 5) ఈఈ, రీజనల్ ఆఫీస్, పిసిబి, తిరుపతి 6) ప్లానింగ్ ఆఫీసర్ తుడా 7) పీ.శామ్యూల్, డివిజనల్ ఫారెస్ట్ అధికారి, వైల్డ్ లైఫ్ డివిజన్ సూళ్లూరుపేట ఇంచార్జీ పులికాట్ బర్డ్ శ్యాంక్చురీ మెంబర్ సెక్రెటరీ వారితో ఏర్పాటైనదని తెలిపారు.

సాగర మాల కింద పూడిక తీతకు చర్యలు నిధుల విడుదల మేరకు చర్యలు నిబంధనల మేరకు చేపడతామని, అలాగే ఇరకం కుప్పం నందు పట్టాల పంపిణీ కి త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు. పులికాట్ లేక్ ఎకో టూరిజం కొరకు ప్రణాళికలు తయారీకి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ వారికి సూచించారు. గ్రావెల్ నుండి బిటి రోడ్ కొరకు, రోడ్ వెడల్పు కొరకు, రహదారి బలోపేతం చేయడానికి కమిటీ స్టడీ చేసి సూచించిన నిర్ణయం మేరకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 80 వేల మంది ప్రజలకు సంబంధించిన సదరు అంశాలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిరాయ దరువు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగు పడతాయని, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల రహదారి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై కమిటీ నిబంధనల మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలిపారు.

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ పులికాట్ లేక్ ప్రాంత పరిధిలో సుమారు 80 వేల మంది నివసిస్తున్నారు అని, పులికాట్ సరస్సు ఏపీ లో సుమారు 400 కిమి లు విస్తరించి ఉందని అన్నారు. బర్డ్ శాంక్చురీ ఏర్పాటు అయిన తర్వాత సదరు గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ లేదు అని రోడ్డు బలోపేతం, వెడల్పు చేయడానికి, కొత్త రోడ్డు వేయాల్సిన అవసరం ఉందని, పులికాట్ ముఖ ద్వారాన్ని పూడి రాయి దరువు వద్ద పూడిక తీయాలని సాగారమాల కింద చర్యలు చేపట్టాలని సూచించారు. పులికాట్ ఎకో టూరిజం ప్రణాలికలు రూపొందించాలని సూచించారు. ఇరకం దీవి లోని పిల్లలకు విద్యాపరంగా వారు ప్రయాణించే బోట్ ఇంజిన్ మరమ్మత్తు ఉన్నాయని వాటికి ఎంపీ లాడ్స్ కింద నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే పూడిరాయదరువు కు రోడ్ కనెక్టివిటీ అవసరం ఎంతైనా ఉందని ఎంపీ తెలిపారు.

ఎమ్మెల్యే సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ మాట్లాడుతూ కొరిడి, పేర్నాడు, దామరాయికి బిటి రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పూడి కుప్పంలోని సుమారు 400 మంది మత్స్యకార కుటుంబాలకు ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.

ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉప్పునీటి శాతం తగినంత మేర ఉంటే ఎకో బ్యాలన్స్ ఉంటుందని తెలిపారు. ఆక్వా కల్చర్ సాగు ద్వారా రాయదరువు వద్ద కాలుష్యం పెరుగుతోందని దాని నివారణ నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శామ్యూల్, రీజనల్ డైరెక్టర్ పర్యాటక శాఖ రమణ ప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎ.నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, డి డి మత్స్య శాఖ నాగరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఎఈ మదన మోహన్ రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయ డిఎఓ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *