Breaking News

పర్యావరణ హిత చవితి కావాలి మనందరి లక్ష్యం

-మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై .. పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యావరణ హిత లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని ‘పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం’పోస్టర్ ను, కరపత్రాలను ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మదన్ మోహన్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మనందరం సమిష్టిగా కృషి చేయాలని సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని చేసే కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడరాదని తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలని కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *