Breaking News

విపత్తు ప్రభావిత(నాచురల్‌ కలామిటీ) జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు…

-బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్‌, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలి..
-వాహనాల బీమా పై ఇన్స్‌రెన్స్‌ కంపెనీలు సహకరించాలి..
-జిల్లా కలెక్టర్‌, డిసిసి చైర్మన్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరిత్యం కింద విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌ కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు చేయడంతో పాటు బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్‌, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలని జిల్లా కలెక్టర్‌, డిసిసి చైర్మన్‌ డా. జి. సృజన సమావేశంలో అధికారులను కోరారు. నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సంప్రదింపుల కమిటీ (డిస్టిక్ట్‌ కన్స్‌ల్‌టేటివ్‌ కమిటీ) ప్రత్యేక సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌, డిసిసి చైర్మన్‌ డా. జి. సృజన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి పునరుద్దరించే పనులలో ఉన్నామన్నారు. ప్రజల జీవనోపాధికి తాత్కాలిక ఆటంకం ఏర్పడిందన్నారు. కృష్ణానది, బుడమేరు వరదల వల్ల నగరంలోని చాలా భాగం జలదిగ్బంధంలో చిక్కుకుందని, ఆయా ప్రాంతాల్లో నివసించే మెజారిటీ ప్రజలు బిపిఎల్‌ కేటగిరీ కిందకు వస్తారన్నారు. ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల పొలాలు ముంపుకు గురయ్యాయని, నగరంలోని నివాస కాలనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ పంటలు, రహదార్లు, పశుసంవర్థక శాఖలకు నష్టం సంభవించిందని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విపత్తు వల్ల ప్రభావితమయ్యే అన్ని అంశాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌ కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో బ్యాంకుల సహాయ చర్యలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంకర్లు సహకారం అంధించాలన్నారు. వరద ప్రభావంతో వాహనాలు నీట మునిగిన దృష్ట్యా బీమా చెల్లింపు విషయంలో ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, న్యూఇండియా ఇన్సూరెన్స్‌ తదితర బీమా కంపెనీలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన కోరారు. సమావేశంలో డిసిసి కన్వినర్‌, యుబిఐ రీజనల్‌ హెడ్‌ యం శ్రీధర్‌, డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ కృష్ణారావు,ఎల్‌డియం కె ప్రియాంక, ఎస్‌బిఐ ఆర్‌యం ఆర్‌. రాఘవరావు, డిస్టిక్ట్‌ బ్యాంక్‌ కో`ఆర్డినేటర్లు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *