Breaking News

స్విమ్స్ ఆధ్వర్యంలో బంగారంపేటలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో చెంబేడు పిహెచ్ సి పరిధిలోని బంగారంపేట విలేజ్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపునకు విశేషంగా ప్రజలు విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. కాగా, సెప్టెంబరు 9వ తేదీ సోమవారం నుండి దొరవారిసత్రం పిహెచ్ సి పరిధిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగనుంది. సెప్టెంబరు 9న పూలతోట, సెప్టెంబరు 11న తనియాళి, సెప్టెంబరు 13న ఉట్చూరులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చెంబేడు పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.హరిత, సర్పంచ్ డి.నాగేంద్రరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సిహెచ్.రమాప్రభ, నర్సింగ్ సిబ్బంది, స్థానిక వైద్య సిబ్బంది, ఎంల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *