-చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు జరిగిన చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ గూర్చి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 77,717 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని 190 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయిందని వారు జడ్పీ సమావేశంలో ఇచ్చిన డ్యాకుమెంటులో పొందుపరిచ బడింది. కాగా ఈ సమావేశంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేత్రుత్వంలోని గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే మొట్ట మొదటగా మన రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో రెండు “పింక్ బస్సుల”లో క్యాన్సర్ స్క్రీనింగ్ ల్యాబ్ లు ఎర్పాటు చేయబడిందని వీటి ద్వారా ఆయా ప్రాంతాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. అల్ట్రా సౌండ్, ల్యాబ్ టెస్ట్ వంటి పరీక్షలు స్విమ్స్ తో అనుసంధానం చేయబడిందని అన్నారు.
19 ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో 2,70,234 మంది ఉండగా ఎం.ఎల్.హెచ్.పి ల ద్వారా 1,76,776 మందిని సర్వే చేసారని అందులో 78,847 మందికి క్యాన్సర్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని అన్నారు. ఇందులో క్యాన్సర్ నిర్ధారణ కోసం “పింక్ బస్సు” వద్దకు తీసుకు రాబడినవారు 8053 అని అందులో 929 మందికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిందని అన్నారు. కానీ “పింక్ బస్సు” వద్దకు నిర్ధారణ పరీక్షలకు తీసుకు రావలసిన వారు సుమారు 70 వేల మంది ఉన్నారని వారిని “పింక్ బస్సు” వద్ద స్క్రీనింగ్ చేసినట్లుయితే మొదటి దశలోనే క్యాన్సర్ గుర్తించి చికిత్స అందించడం వలన క్యాన్సర్ బారిన పడ్డ వారిని కాపాడవచ్చని ఎంపీ గురమూర్తి అన్నారు. క్యాన్సర్ నిర్దారణ అయిన 929 మందిలో స్విమ్స్ హాస్పిటల్ లో రకరకాల క్యాన్సర్ తో 250 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఎందుకు అధికారులతో సమన్వయం చేసుకొని సరైన డేటాని పొందు పరచడం లేదని అధికారులని నీలదీశారు. ప్రాధమిక స్థాయిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తింపబడిన అందరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే క్యాన్సర్ నిర్దారణ అయిన వారికి ప్రతి ఒక్కరికి చికిత్స అందేలా చేయాలని వారిని కోరారు. క్యాన్సర్ వలన దేశంలో ప్రతి యేటా 9,16,000 వేల మంది మరణిస్తున్నారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
Prajavartha Online Telugu News