Breaking News

జ‌గ‌న్ ఇక నీ రాజ‌కీయ జీవితానికి పుల్ స్టాప్ ప‌డింది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం
-స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, మంత్రి నారాయ‌ణ‌
-జ‌గ‌న్ తీరును ఎండ‌గ‌ట్టిన మంత్రులు, ఎంపి
-అమ‌రావ‌తి అంటే జ‌గ‌న్ కి ద్వేషం…అందుకే కుట్ర‌లు
-ప్ర‌జ‌లు గ్ర‌హించిన జ‌గ‌న్ వికృత మ‌న‌స్త‌త్వం
-బుడ‌మేర‌కు నిధులు మంజూరుతో పాటు 70 శాతం ప‌నులు పూర్తి చేసిన టిడిపి
-2019 త‌ర్వాత త‌ట్ట మ‌ట్టి కూడా వేయ‌ని జ‌గ‌న్
-బాధ్య‌త లేని వ్య‌క్తి ఎమ్మెల్యే జ‌గ‌న్ రెడ్డి
-ప్రకాశం బ్యారేజీనే కూల్చాలని చూసిన దుర్మార్గుడు జ‌గ‌న్
-బోట్ల బ్యారేజీని ఢీ కొన‌టం వెన‌క రాజ‌కీయ కుట్ర‌
-మొద‌ట అనుమానం వ‌చ్చింది జ‌గ‌న్ చెల్లి వై.ఎస్.ష‌ర్మిలాకే
-జైలు లో త‌న కోసం ఐపిఎల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న జ‌గ‌న్
-టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడిలో అసలు నేరస్థుడు జగనే
-ఆ దాడిని ప్రోత్సహించానని ప‌రోక్షంగా ఒప్పుకున్న జగన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో ఏ రోజు కృష్ణ న‌దిలో ప‌డ‌వ‌లు కొట్టుకొచ్చి బ్యారేజీకి ఢీ కొన‌లేదు. జ‌గ‌న్ అధికారంలో వున్న స‌మ‌యంలోనే 2020 లో ఒక ప‌డ‌వ కొట్టుకొచ్చింది. ప్ర‌తి ప‌క్ష హోదాలో కూడా ద‌క్కించుకోలేక‌పోయిన జ‌గ‌న్ ఈ సారి మూడు బోట్ల‌తో ప్ర‌కాశం బ్యారేజ్ తో పాటు అమ‌రావ‌తి ప్రాంతాన్ని నాశనం చేయాల‌నే కుట్ర‌ప‌న్నాడు. జ‌గ‌న్ వికృత మ‌న‌స్త‌త్వం ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నారు కాబ‌ట్టే 11 సీట్లు ఇచ్చి ప‌క్క‌న కూర్చొపెట్టారు. ఈసారి మూల‌న కూర్చొబెడ‌తారు. జ‌గ‌న్ రాజ‌కీయ జీవితానికి ఇక ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్లేన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

రాష్ట్రంలో ఇంత ద‌ర్మార్గ‌మైన పాల‌న ఎన్న‌డూ లేదంటూ ఎమ్మెల్యే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఇరిగేష‌న్ మినిష్ట‌ర్ నిమ్మ‌ల రామానాయుడు, మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు క‌లిసి గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ వ‌ర‌ద స‌మ‌యంలో కొట్టుకొచ్చి ప్ర‌కాశం బ్యారేజ్ ను ఢీ కొన్న మూడు ప‌డ‌వ‌ల వెనుక కుట్ర జ‌రిగింద‌ని, దీనిపై విచార‌ణ జ‌ర‌గాల‌ని కొరింది జ‌గ‌న్ చెల్లిలు వై.ఎస్.ష‌ర్మిలా..ఆమె ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల‌ని కోరారు. బోటు యాజ‌మానులు త‌ల‌శిల ర‌ఘురామ్ , నందిగామ సురేష్ బంధువులు, అనుచ‌రులు వారిని టిడిపి కార్య‌క‌ర్త‌లుగా ప్ర‌చారం చేయ‌టానికి మార్ఫింగ్ పోటోలు ఉప‌యోగించి జ‌గ‌న్ త‌న విష‌పు ప‌త్రిక సాక్షిలో అబ‌ద్ద‌పు రాత‌లు రాయిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. త‌న రాజ‌కీయ జీవితం స‌మాధి కాకుండా…జ‌గ‌న్ త‌న విష‌పు ప‌త్రిక సాక్షిలో అబ‌ద్దపు రాత‌లు రాయిస్తూ వాటిని న‌మ్మించేందుకు శ‌త‌విధాలుగ తంటాలు ప‌డుతున్నాడని తెలిపారు..

ప్ర‌జ‌లు విప‌త్తులో వుంటే వారి ఆదుకోవాల్సింది పోయి…బుర‌ద రాజ‌కీయం చేస్తున్నాడన్నారు. జ‌గ‌న్ కి
కృష్ణ ప‌రివాహ‌క ప్రాంతాలు గురించి మాత్ర‌మే కాదు…తుఫాన్ కార‌ణంగా కృష్ణ న‌దికి ఎంత నీరు వచ్చిందో , బుడ‌మేర వాగుకి ఎంత వ‌ర‌ద వ‌చ్చిందో కూడా తెలియ‌ద‌న్నారు. అసలు బుడ‌మేరు ఎటు నుంచి ఎటు ప్ర‌వ‌హిస్తుందో కూడా తెలియ‌దని ఎద్దేవా చేశారు..అంతే కాదు డైవ‌ర్ష‌న్ కెనాల్ అంటే ఏమిటో తెలియదన్నారు.

జ‌గ‌న్ త‌న అజ్ఞానం కొద్ది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై , రాష్ట్ర ప్ర‌భుత్వం పై పిచ్చి ప్రేలాప‌న‌లు ప‌ల‌క‌టం అల‌వాటుగా మారింద‌న్నారు. ఇప్పుడు పుట్టుగ‌తులుండవంటున్నాడు.. ఇప్ప‌టికే జ‌గ‌న్ కి ప్ర‌జ‌లు పుట్ట‌గ‌తులు లేకుండా చేశారు. తన రాజకీయ జీవితానికి పుట్టగతులు లేకుండా పోయిన‌జగన్…, పుట్టగతులు లేకుండా చేస్తాన‌ని బెదిరించాలని చూడటం హాస్యాస్పదంగా వుంద‌న్నారు.

గతంలో జైలుకెళ్లిన జగన్ అక్క‌డ‌ నిందితులతో ఓ బ్యాడ్మింటన్ టీమ్ ను తయారు చేసుకోగా, ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ తరహా క్రికెట్ జట్లనే జైల్లో తనకోసం సిద్ధం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

జ‌గ‌న్ కి అమ‌రావ‌తి ప్రాంతమంటే విప‌రీత‌మైన ద్వేషం పైగా ఎన్టీఆర్ జిల్లా లో ఒక సీటు కూడా ద‌క్క‌క‌పోవ‌టంతో జిల్లాపై కూడా ద్వేషం పెంచుకున్నాడని అందుకే విజ‌య‌వాడను నీట ముంచేందుకు మూడు ప‌డ‌వ‌ల‌తో కుట్ర చేశాడ‌న్నారు. జ‌గ‌న్ బ‌తుకు ఒక అబ‌ద్దాల పుట్ట అన్నారు. నీచ రాజ‌కీయం చేయ‌టమే జ‌గ‌న్ కి అల‌వాటుగా మారిపోయింద‌న్నారు. . గ‌త ఎనిమిదేళ్ల నుంచి జ‌గ‌న్ చేస్తున్న‌ డ్రామ‌లు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని తెలిపారు. బాబాయి హ‌త్య డ్రామా, కోడి క‌త్తి డ్రామా, గుల‌కరాయి డ్రామా, ఇప్పుడు బుర‌ద రాజ‌కీయం మొద‌లు పెట్టాడని ప్ర‌జ‌లు ఎవ‌రు న‌మ్మే స్థితిలో లేరన్నారు.
ఇంకా ఈ డ్రామాలు ఆడితే ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా పీకి ప‌క్క‌న కూర్చొబెడ‌తారని ఈ విష‌యం జ‌గ‌న్ ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచింద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తానే వున్నారన్నారు..ఈ విపత్తు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాకుంటే ప‌రిస్థితి ఊహించ‌టానికే భ‌యంగా వుంద‌నే అభిప్రాయానికి ప్ర‌జ‌ల వ‌చ్చార‌ని తెలిపారు. గ‌త ప‌ది రోజులుగా అధికారులు, మంత్రులు, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు యజ్ఞం చేశారని తెలిపారు. ఇరిగేష‌న్ మంత్రి నిమ్మల రామానాయుడు గండి ప‌డిన చోట వాటిని పూడ్చేందుకు నిద్ర‌పోకుండా ప‌దిరోజుల పాటు క‌ష్ట‌ప‌డ్డారన్నారు. అలాగే మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ కూడా న‌గ‌రంలో శానిటేష‌న్ స‌మ‌స్య‌లు రాకుండా ప‌నులు చేయించారని, వ‌ర‌ద నీటితో నిండిన కాల్వ‌ల‌ను, నిండిన కెనాల్స్ నుంచి నీటిని మ‌ళ్లించి విజ‌య‌వాడ‌ను ర‌క్షించ‌టంలో కీల‌క పాత్ర పోషించారని తెలిపారు.

ఈ విప‌త్తు నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు ప‌ది రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా క‌ష్ట‌ప‌డిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఎన్టీఆర్ జిల్లా ప్ర‌జ‌ల తరుఫున ఎంపి కేశినేని శివ‌నాథ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జ‌గ‌న్ పాపాలు..రాష్టానికి శాపాలు : మంత్రి నిమ్మ‌ల రామానాయుడు
ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడానికి ముందు డుతూ విజయవాడ వరదలకు మాజీ ముఖ్య‌మంత్రి జగనే కారణమని ఆరోపించారు. 2020లో జగన్ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసిందని మండిప‌డ్డారు. ఆ రద్దు చేసిన ప‌నుల్లో బుడమేరుకు సంబంధించి 5 పనులు ఉన్నాయని తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులను చంద్రబాబు 80శాతం పూర్తి చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ ప‌నులు ర‌ద్దు చేయించాడ‌ని..అందుకే బుడమేరు వాగుకి గండ్లు ప‌డి న‌గ‌రానికి వ‌ర‌ద ముంపు ఏర్ప‌డింద‌న్నారు. బెజవాడకు దుఃఖదాయిని బుడ‌మేర అని గ్ర‌హించిన‌ చంద్రబాబు భ‌విష్య‌త్తులో ఎలాంటి విప‌త్తు జ‌ర‌గకూడ‌ద‌ని బుడ‌మేరు డైవర్ష‌న్ ప‌నులు ప్రారంభించాడ‌న్నారు. ఆ మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావన్నారు.

గ‌త ఐదేళ్లుగా జ‌గ‌న్ చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయ‌న్నారు. బుడమేరుకు గండ్లు పడటం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని తెలిపారు. బుడ‌మేరు ఆధునికీకరణ పనులను రద్దు చేసిన జగన్ కు బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

13.08లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రకాశం బ్యారేజీ పై కూడా జగన్ కుట్ర గ‌మ‌నిస్తే…ఎంత నీచ మ‌న‌స్తత్వ‌మో తెలుసుకుంద‌న్నారు. మూడు బోట్ల విలువ దాదాపు కోటి యాభై ల‌క్ష‌ల రూపాయ‌లు వుంటుంది..వ‌ర‌ద కార‌ణంగా ఇంత విలువైన బోట్లు కొట్టుక‌పోకుండా ముందుగా జాగ్ర‌త్త ప‌డ‌తారు. ఈ విష‌యం తెలిసి కూడా బోటు య‌జ‌మానులు లంగ‌రు వేయ‌క‌పోవ‌టం చూస్తే కుట్ర కోణం అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. . కుట్ర కోణం లేకపోతే బోట్లకు లంగరు
ఎందుకు వేయలేదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పైగా మూడు బోట్ల‌కు ఒకదానికొకటి లింక్ చేసి వ‌దిలారు. ఈ మూడు బోట్లకు లంగరు వేయకుండా నైలాన్ తాడుతో కట్టి వ‌దిలేశారని తెలిపారు. .

దాదాపు 120 ట‌న్నుల బ‌రువు వున్న ఈ మూడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ ను ఢీ కొన‌టంతో 17 టన్నుల బరువు ఉన్న కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైందని తెలిపారు. . అదే పడవలు బ్యారేజీ పిల్లర్ను
ఢీకొని ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి చాలా దారుణంగా వుండేద‌ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

ప‌రోక్షంగా నిజం ఒప్పుకున్న జ‌గ‌న్ : మంత్రి నారాయ‌ణ‌
మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ జ‌గ‌న్ అస‌మ‌ర్థ పాల‌న వ‌ల్లే బుడ‌మేర వాగు కి వ‌ర‌ద వ‌చ్చి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌రిపాల‌న అంటే తెలియ‌ని జ‌గ‌న్ … ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును విమ‌ర్శించే అర్హ‌త లేద‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్ని డిపార్ట‌మెంట్స్ , ఎంత మంది అధికారుల‌తో రివ్యూ మీటింగ్స్ పెట్టాడో జ‌గ‌న్ తెలుసుకోవాల‌న్నారు. జ‌గ‌న్ గ‌త ఐదేళ్ల‌లో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్ట‌లేద‌న్నారు. జ‌గ‌న్ అధికారులు, ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర వుండి రాష్ట్రంలోని స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు జ‌గ‌న్ ఏనాడు దృష్టి పెట్ట‌లేద‌న్నారు.

ఇంత పెద్ద విప‌త్తు సంభ‌వించి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే జ‌గ‌న్…టిడిపి కేంద్ర కార్యాల‌యంపై దాడి చేసిన నిందితుడ్ని ప‌రామ‌ర్శించ‌టానికి వెళ్ల‌టం చూస్తే ప్ర‌జ‌ల‌పై జ‌గ‌న్ కి ఎంత ప్రేమ వుందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. గ‌త ఐదేళ్లుగా అధికారులు వర్క్ చేయ‌టం మ‌ర్చిపోయామ‌ని, చంద్ర‌బాబు ముఖ్యమంత్రి కావ‌టంతో వర్క్ చేయ‌టం మొద‌లుపెట్టామ‌ని, వ‌ర్క్ చేయాల‌నే ఇంట్రెస్ట్ క‌లుగుతుంద‌ని చెబుతున్నార‌న్నారు. గ‌త ఐదేళ్లుగా జ‌గ‌న్ రెడ్డి పనిచేయ‌లేదు…అధికారుల‌తో ప‌ని చేయించ‌లేద‌న్నారు. ఈ జ‌గ‌న్ రెడ్డి అధికారంలో వున్న స‌మ‌యంలో ఇలాంటి విప‌త్తు వ‌చ్చి వుంటే ప‌రిస్థితుల్ని సాధార‌ణ స్థితికి తీసుకురావ‌టానికి వంద రోజ‌లు పట్టేద‌న్నారు.

జ‌గ‌న్ త‌న విష‌పు ప‌త్రిక సాక్షిలో జ‌రిగింది ఒక‌టైతే…పోటోలు మార్పింగ్ చేసి మ‌రోక‌టి రాస్తున్నాడు..ఈ విష‌యం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. ఎవ‌రో ఒక వ్య‌క్తి తిట్టాడ‌ని టిడిపి కేంద్ర కార్యాల‌యంపై కి దాడికి పంపించ‌టం సిగ్గు చేట‌న్నారు. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో రాష్ట్రంలో అర‌చాకాన్ని ప్రోత్స‌హించాడన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడిని ఆరోజు ముఖ్యమంత్రి గా తానే ప్రోత్సహించానని జగన్ ఒప్పుకున్నాడని తెలిపారు. టిడిపి కార్యాలయంపై దాడిలో అసలు నేరస్థుడు జగనే అని ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా స‌రే చ‌ట్టాన్ని గౌర‌వించాల‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో ఏనాడు న‌డుచుకోలేద‌న్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *