Breaking News

ప్రాణం అరచేతిలో పట్టుకొని బయటపడ్డారు

-ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలి – వరద బాధితులను ఆదుకోవాలి ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాల కారణంగా ముంపుకు గురై తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా నష్టపోయినా వరద భాదితులకు ప్రతిఒక్కరు సహాయంగా నిలవాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి అన్నారు.

స్థానిక చిట్టినగర్ లోని కలరా హాస్పిటల్ సమీపంలో గల వియంసి కాలనీలో గురువారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్జీజీఓస్ సంఘం తరుపున వరద ముంపుకు గురైన కుటుంబాలకు ఎన్జీజీఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తమ నాయుడు చేతుల మీదగా దుప్పట్లు టవర్స్,లుంగీ, చీరతో కూడిన వస్త్రాల కిట్ ను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ ఈ విపత్తు కారణంగా అనేక నిరుపేద కుటుంబాలు నిరాశ్రయులయ్యాయన్నారు. బ్రతికి బయటపడితే చాలురా దేవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారని ఆయన గుర్తుచేశారు. ఆర్థికంగా చాలా నష్టానికి గురయ్యారన్నారు. ఇటువంటి కష్ట కాలంలో బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని, తోటి మనుషుల పట్ల మానవత్వంతో స్వచ్ఛందంగా సహకారాలు అందించాలని ఆయన కోరారు. వరద బాధిత కుటుంబాలకు అండగా ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన ఒక రోజు బేసిక్ పే సుమారు 120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి అంగీకారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు తెలియజెయ్యడం జరిగిందని ఆయన అన్నారు.. కోవిడ్ సమయంలో కూడా భాదితులకు అండగా ఏపీ ఎన్జీజీఓస్ సంఘం నిలబడిందన్నారు.

జిల్లా అధ్యక్షుడు ఎ విద్యా సాగర్ మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజలకు అండగా నేనున్నా అంటూ రాత్రిపగళ్ళు తేడాలేకుండా వరద నీటిలోనే తిరుగుతూ వరదల్లో చిక్కుకున్న భాదితులకు స్వయంగా పలకరిస్తూ, పరిస్థితులను తెలుసుకుంటూ జిల్లా అధికారయంత్రాంగాన్ని అప్రమిత్తం చేసి భాదితులకు కావాల్సిన సహాయచర్యలు చేపట్టడం, సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం ఆహారంతో పాటుగా నిత్యవసర వస్తువులను ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సహాయ చర్యలు చేపట్టడం వలన పెద్దగా ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వదిలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ముఖ్యమంత్రి ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను తెలుసుకుంటూ , పరిస్థితులు మెరుగయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అహర్నిశలు కృషి చేశారని ఆయన కొనియాడారు. వరద ముంపుకు గురైనటువంటి బాధ్యతలను రక్షించే దానిలో ఆరోగ్యశాఖ మునిసిపాలిటీ అగ్నిమాపకదళం అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులు అధికారులు కూడా ఆలు పెరగకుండా పనిచేశారన్నారు. వరద సమయంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వలనే ఈనాడు యధాస్థితికి మరల రాగలిగామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయంను అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర సంఘం నాయకులు వి దస్తగిరి రెడ్డి, డివి రమణ, ఎ రంగారావు, కె జగదీష్, యం వి కృష్ణ రెడ్డి, యం రాజ్యలక్ష్మి, విశాఖపట్నం జిల్లా ఎన్జీజీఓస్ అధ్యక్షులు ఈశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు డి సత్యనారాయణ రెడ్డి, పి రమేష్, యం.రాజుబాబు, బి సతీష్, నగరశాఖ నాయకులు షైక్ నజీరుద్దీన్, రాజశేఖర్, మధుసూదనరావు, శ్రీనివాసరావు, శివ శంకర్, ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *