Breaking News

పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-బోండా ఉమామహేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుస్వభావంలో, సంస్కారంలో స్వచ్ఛత ఉండాలి
-గంధం చంద్రుడు, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి
-స్వచ్ఛతతోనే ఆరోగ్యం – ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛభారత్ దిశగా అడుగులేసే తరుణంలో, స్వచ్ఛ విజయవాడ వైపు మరో ముందడుగు వేస్తూ సెప్టెంబర్ 17, 2024 నుండి అక్టోబర్2, 2024 వరకు జరిగే “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మాకినేని బసవ పున్నయ్య స్టేడియం అజిత్ సింగ్ నగర్ నందు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపుమేరకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అందరి సమక్షంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు, స్వచ్ఛ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి సమరం ముందుగా స్వచ్ఛత హి సేవ పోస్టర్ను, బలూన్స్ ను విడుదల చేసి స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శుభ సంకల్పంతో మొదలైన స్వచ్ఛభారత్, ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా ఎంతో అందంగా పరిశుభ్రంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పట్ల సంకల్పాన్ని మేలుకొలిపారన్నారు. ప్రతిరోజు మన ఇంటిని మన పరిసరాలని ఎంత అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతకంటే ఎక్కువ పరిశుభ్రంగా మన విజయవాడని ఉంచాలని అన్నారు. మొక్కలని నాటడం ఒక అలవాటుగా చేసుకోవాలని అవి మనిషికి ప్రాణవాయువునిస్తుందని మనిషి వదిలే కార్బన్డయాక్సైడ్ ను మొక్కలు పీల్చి మనిషికి ఉపయోగపడే ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మొక్కలను ప్రతి ఇంట్లో, వీధిలో, స్కూల్లో నాటుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మెలగాలని, పరిశుభ్రత పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్నందుకు అభినందించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు రెండు సంవత్సరాల క్రితం తను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు బోస్టన్ లో చార్లెస్ రివర్ దగ్గర జరిగిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. చార్లెస్ నది ఒడ్డున ఒక మహిళ పెంపుడు కుక్కని తీసుకు వచ్చినప్పుడు అనుకోని పరిస్థితిలో అది మలవిసర్జన చేస్తే ఆ మహిళ అక్కడే వదిలేయకుండా దాన్ని పరిశుభ్రపరచందన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ తరహాలోనే ప్రతి ఒక్కరూ తనంతటతానే పరిశుభ్రత పట్ల దృఢ సంకల్పంతో ఉండాలి అన్నారు. ప్రతి ఒక్కరూ స్వభావంలో స్వచ్ఛత, సంస్కారంలో స్వచ్ఛత ఉండాలని కొనియాడారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 2014న మహాత్మా గాంధీ గారి శుభసంకల్పంతో స్వచ్ఛభారత్ మిషన్ గా మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ను 2024 గాను నేటికీ పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ పది సంవత్సరాల ప్రయాణంలో 3, 5, 6వ స్థానాలు స్వచ్ఛభారత్ లో కైవసం చేస్తుందని దీనికి ముఖ్య కారణం ప్రజలందరి సహకారమేనని అన్నారు. విజయవాడ నగరాన్ని మరింత అందంగా ఉంచేందుకు, అధిక శాతం మొక్కలను నాటటమే కాకుండా వ్యర్థాలను పరిశుభ్రపరిచేందుకు వాహనాలను పెంచారని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛతను పాటించాలి అన్నారు. ఇల్లు, పరిసరరాలతో పాటు తన నివసిస్తున్న ప్రాంతంలో కూడా పరిశుభ్రతను పాటించాలన్నారు. స్వచ్ఛత హి సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2,2024 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టడమే కాకుండా స్వచ్ఛభారత్ లో ప్రథమ స్థానంలో ఉంచాలని, అది కేవలం ప్రజల దృఢ సంకల్పంతోనే సుసాధ్యమని అన్నారు.

తదుపరి ముఖ్య అతిథులు, విద్యార్థినీ విద్యార్థులు,స్వచ్ఛత హి సేవలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని స్వచ్ఛత ప్రతిజ్ఞ తీసుకున్నారు, ముఖ్య అతిథులు అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. తదుపరి స్వచ్ఛత హి సేవ అంటూ చీపుర్లు పట్టుకొని పరిసరాలను పరిశుభ్రపరిచారు. పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీకు ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛత ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించడమే కాకుండా 58,59, 60 వ డివిజన్లో పరిసరాలన్నీ పరిశుభ్రపరిచారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కేవీ సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్లు, ఎస్ ఆర్ కే ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆంధ్ర లయోలా కాలేజ్ విద్యార్థులు, ఎంకే బ్రేక్ స్కూల్ విద్యార్థులు, డాక్టర్ జె డి ఎం ఎం సి హై స్కూల్ విద్యార్థులు, ఎస్ పి ఎస్ ఎం సి స్కూల్ విద్యార్థులు, వివేకానంద సెంటినరీ హై స్కూల్, పోలీస్ బృందం, సివిఆర్ లయన్స్ క్లబ్, డి బి ఆర్ సి ఎన్జీవో, అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *