Breaking News

పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 22

-38 విభాగాల నుంచి 41 అవార్డులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అవార్డులు పొందడానికి అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేసారు. మంగళవారం విశ్వ కర్మ జయంతి వేడుకల సందర్భంగా పర్యటక రంగం అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డుల కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్ సైట్ www.aptourism.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకుని పూర్తి చేసిన తర్వాత ఎపి టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు ఈ నెల 22లోగా అందజేయాలన్నారు. ఉత్తమ హోటల్ (5 స్టార్, 4 స్టార్, 3 స్టార్), ఉత్తమ బడ్జెట్ హోటల్, బెస్ట్ వే సైడ్ ఎమినిటీస్, ఉత్తమ హరిత హోటల్, ఉత్తమ పర్యావరణ అనుకూల హోటల్, ఉత్తమ థీమ్ ఆధారిత రిసార్ట్, హోటల్లో ని ఉత్తమ రెస్టారెంట్, ఉత్తమ థీమ్ రెస్టారెంట్, ఉత్తమ స్టాండ్-అలోన్ రెస్టారెంట్, ఉత్తమ చెఫ్, ఉత్తమ చెఫ్ (ఆంధ్రా వంటకాలు), ఉత్తమ స్టాండ్-ఒంటరి కన్వెన్షన్ సెంటర్, బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్టు, టూరిస్టు డెస్టినేషన్ యొక్క ఉత్తమ పౌర నిర్వహణ (పట్టణ ప్రాంతాలు,.గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలు), పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉత్తమ జిల్లా (కలెక్టర్), ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ బీచ్, ఉత్తమ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్, సినిమా షూటింగ్ ఉత్తమ స్థానం, ఉత్తమ పర్యాటక అనుకూల విమానాశ్రయం, బెస్ట్ టూరిస్టు ఫ్రెండ్లీ బస్ స్టాండ్, స్థానిక పర్యాటక ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టు యొక్క ఉత్తమ సమగ్ర అభివృద్ధి, ఉత్తమ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్, ఉత్తమ ట్రావెల్ ఏజెంట్, ఉత్తమ ట్రావెల్ ఏజెంట్ (బోటింగ్), ల్యాండ్, ఏరో, వాటర్ స్పోర్ట్స్ కోసం బెస్ట్ అడ్వెంచర్ ఇన్బెండ్ టూర్ ఆపరేటర్ (డొమెస్టిక్), అత్యంత వినూత్నమైన ఇన్బెండ్ టూర్ ఆపరేటర్ (దేశీయ), టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్న బెస్ట్ ఎమర్జింగ్ ట్రావెల్ కంపెనీ, ఉత్తమ పర్యాటక విద్యా సంస్థ, రచన/ప్రచురణలో శ్రేష్ఠత, ఉత్తమ టూరిస్ట్ గైడ్, ఏపీ టూరిజంపై ఉత్తమ చిత్రం, ఉత్తమ పర్యాటక ప్రమోషన్ కొలేటరల్ పబ్లిసిటీ మెటీరియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అత్యంత వినూత్న వినియోగం/ఉత్తమ టూరిజం వెబ్సైట్/పోర్టల్ ప్రమోటింగ్, ఆంధ్రప్రదేశ్ కళ, సంస్కృతి ద్వారా పర్యాటక ప్రచారం, ఎపి టూరిజాన్ని ప్రోత్సహించే ఉత్తమ బ్లాగర్/సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, విభాగాలకు అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ వి.స్వామినాయుడు, జిల్లా పర్యాటక అధికారి పి. వెంకటాచలం వున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *