Breaking News

స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమము

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమమునకు సంబంధించి మంగళవారం రూరల్ ధవళేశ్వరం గ్రామము పరిథిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిసరాల పరిశుభ్రత మానవహారం చేసి సదరు కార్యక్రమముకు సంబంధించి ప్రజలకు అవగాహన చేసి అందరితో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని నిర్వహించియున్నారు. పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం తో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే మనం తినే ఆహారం కలుషితమగుచున్నదని, అందువల్ల ఎన్నో అనారోగ్యాలకు గురి అవ్వడం చూస్తున్నాం అన్నారు. మనం మాత్రమే కాకుండా మన గ్రామమును నగరమును కూడా పరిశుభ్రముగా చేసుకోవాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటలో అధికారులు, అనధికారులు మరియు విద్యార్ధులు, విద్యార్థినులు కలిసి ప్రయాణం చేయాలని సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా పరుగు, సైకిల్ ర్యాలీలు, మొక్కలు నాటి కార్యక్రమం, ఎన్ జి వో లు , మహిళాశక్తి సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛతా పరిశుభ్రత గురించి అవగాహనా సదస్సులు చేపట్టి, నీటిని ఆదా చేయుట, నీటి ట్యాంకులను పరిశుభ్రం చేయుట, వీది నాటికలు, పోటీలు నిర్వహించుట, సైబర్ మరియు డిజిటల్ స్వచ్చ గ్రామ సభలు నిర్వహించాలని తెలియజేసియున్నారు. అలాగే అక్టోబర్ 02 వ తేదీ వరకు సదరు కార్యక్రమములలో ప్రజలంతా భాగస్వాములు కావలసినదిగా తెలియజేసినారు. సదరు కార్యక్రమమునకు స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్ధులు, విద్యార్దినులు, పంచాయతీ సిబ్బంది, మండల ప్రత్యేకాధికారి కే.ఎస్. జ్యోతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. శ్రీనివాసరావు, విస్తరణాదికారి డి. బాబూరావు, పంచాయతీ కార్యదర్శి, డి.సూర్యనారాయణ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *